Shilpa Shirodkar: భారత్‌లోకి కరోనా.. మహేష్ బాబు వదినకు పాజిటివ్!
ABN, Publish Date - May 19 , 2025 | 05:59 PM
కరోనా మహమ్మారి మరోసారి పంజా విప్పుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సింగపూర్, థాయ్‌లాండ్, హాంగ్‌కాంగ్ విజృంభిస్తోంది.
కరోనా మహమ్మారి మరోసారి పంజా విప్పుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సింగపూర్, థాయ్‌లాండ్, హాంగ్‌కాంగ్ విజృంభిస్తోంది. నిత్యం 3వేలకు పైగా కేసులు నమోదవుతూ అక్కడి ప్రభుత్వాలను కలవర పెడుతూ అక్కడి ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తోంది. చైనాలో కొన్ని నగరాల్లో లాక్‌డౌన్లు సైతం కొనసాగుతున్నాయి. వీటిని అధ్యయనం చేస్తున్న శాస్త్రవేత్తలు ఇది మరిన్ని దేశాలకు విస్తరించే అవకాశం ఉన్నదని, అన్ని దేశాలు జాగురతతో ఉండాలని ఇప్పటికే ప్రకటించాయి కూడా. ఈ నేపథ్యంలో భారత్ కరోనాను నియంత్రించేందుకు చర్యలు చేపడుతుండగా క్రమంగా మన దేశంలోనూ కోవిడ్ కలవరం మొదలైంది.
ఇదిలాఉంటే తాజాగా కొవిడ్ బాలీవుడ్ సెలబ్రిటీస్ ఇంటిని తట్టింది. హీరో మహేష్ బాబు (Mahesha Babu) సతీమణి నమ్రత (Namrata Shirodkar) సోదరి అలనాటి బాలీవుడ్ హీరోయిన్ శిల్పా శిరోద్కర్ (Shilpa Shirodkar) కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు శిల్ప ఎక్స్ లో పోస్టు చేసి.. మిత్రులారా నాకు కొవిడ్ పాజిటివ్ గా తేలిందని.. మీరు జాగ్రత్తగా ఉండండి.. మాస్కులు ధరించండి అని పోస్టు చేసింది. శిల్పా పోస్టు చూసిన నెటిజన్లు, సినీ ప్రముఖులు ఆమెకు ధైర్యం చెప్పారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అటు సోదరి నమ్రత కూడా శిల్ప త్వరగా కోలుకోవాలని లవ్ ఎమోజీలతో రిప్లై ఇచ్చింది. సోనాక్షి సిన్హా, సోనాలి బింద్రే, డయానా పాండే తదితరులు కూడా శిల్పా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కాగా కోవిడ్-19 వ్యాక్సినేషన్ పొందిన మొదటి భారతీయ సినీ పరిశ్రమ నటిగా శిల్పా శిరోద్కర్ గుర్తింపు ఉంది.
ప్రస్తుతం విస్తరిస్తున్న కోవిడ్ వైరియస్ ఓమిక్రాన్ అనుబంధ వేరియంట్లలో ఒకటిగా చూస్తున్నారు. ఇదిలాఉండగా ఐపీఎల్ టీ20 క్రికెట్‌లో హైదరాబాద్ సన్‌రైజర్స్ టీంకు ప్రాతినిధ్యం వహిస్తున్న ట్రావిస్ హెడ్ సైతం కొవిడ్ పాజిటివ్‌గా తేలడంతో తదుపరి మ్యాచ్‌లకు ఆయన దూరమయ్యారు.