Premaku Namaskaram: రూట్ మార్చిన.. మంగపతి
ABN , Publish Date - Oct 05 , 2025 | 07:45 AM
తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ కొత్త కాన్సెప్ట్‌లను, న్యూ ఏజ్ చిత్రాలను హర్షిస్తూ ముందుంటారు.
తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ కొత్త కాన్సెప్ట్‌లను, న్యూ ఏజ్ చిత్రాలను హర్షిస్తూ ముందుంటారు. తాజాగా యూట్యూబ్ సెన్సేషన్లు వెండితెరపై అడుగుపెడుతూ విజయాలను సొంతం చేసుకుంటున్నారు. లిటిల్ హార్ట్స్‌తో మౌళి తనూజ్ సక్సెస్ అందుకున్న తర్వాత, ఇప్పుడు షణ్ముఖ్ జస్వంత్ హీరోగా వస్తున్న ‘ప్రేమకు నమస్కారం’ (Premaku Namaskaram) సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నటుడు శివాజీ (Sivaji) ప్రధాన పాత్రధారిగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో షణ్ముఖ్ జస్వంత్ (Shanmukh Jaswanth), ఉల్క గుప్తా జంటగా నటిస్తున్నారు.
భీమశంకర్ (V Bhima Shankar) దర్శకత్వంలో అనిల్ కుమార్ రావాడ ( Anil Kumar Ravada), భార్గవ్ మన్నె (Bharghav Manne), నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మహాదేవనాయుడు (Mahadeva Naidu)గా శివాజీ శక్తిమంతమైన పాత్రలో కనిపించనున్నారు. తాజాగా చిత్ర బృందం ఆయన పాత్రను పరిచయం చేస్తూ ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘ఇదొక యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్, యువతకు మంచి సందేశంతో పాటు వినోదం పంచుతుంది’ అని చెప్పారు. ఉల్క గుప్తా హీరోయిన్‌గా నటిస్తుండగా, ప్రముఖ నటుడు శివాజీ ‘మహాదేవ నాయుడు’గా పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించబోతున్నారు.
శుక్రవారం విడుదలైన ఆయన క్యారెక్టర్ వీడియోకు అద్భుత స్పందన లభించింది. భూమిక చావ్లా మరో కీలక పాత్రలో కనిపించనున్నారు. యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్‌గా కనిపిస్తున్న ఈ సినిమాలో ప్రేమ, బ్రేకప్, ఫన్నీ కాన్వర్సేషన్లు ప్రేక్షకులను బాగా కనెక్ట్ అయ్యేలా ఉంటాయంటున్నారు మేకర్స్. "నేటి యువత లవ్, బ్రేకప్‌లను రియలిస్టిక్‌గా, ఎంటర్‌టైనింగ్‌గా చూపించాం. శివాజీ గారి పాత్ర సినిమాకు హార్ట్‌గా ఉంటుంది" అని దర్శకుడు తెలిపారు.మొత్తం మీద, ‘ప్రేమకు నమస్కారం’ యూత్‌కి దగ్గరగా, ఫ్రెష్ కాన్సెప్ట్‌తో సజావుగా సాగే లవ్ ఎంటర్‌టైనర్‌గా ఆసక్తి రేకెత్తిస్తోంది.