Sridevi: మరో బంఫర్ ఛాన్స్.. కొట్టేసిన 'కోర్టు' భామ
ABN , Publish Date - Nov 16 , 2025 | 11:11 PM
ఇటీవల జో వంటి బ్లాక్ బస్టర్ చిత్రం అందించిన విజన్ సినిమా హౌజ్ బ్యానర్‌లో మరో ఆసక్తికరమైన చిత్రం తెరకెక్కుతుంది.
ఇటీవల జో వంటి బ్లాక్ బస్టర్ చిత్రం అందించిన విజన్ సినిమా హౌజ్ (Vision Cinema House )బ్యానర్‌లో మరో ఆసక్తికరమైన చిత్రం తెరకెక్కుతుంది. అయితే ఇది తెలుగు, తమిళంలో ఏక కాలంలో రూపొందనుండడం విశేషం. ఇప్పటికే.. ‘కోజిపన్నై చెల్లదురై’, ‘కానా కానమ్ కాలంగల్’ వంటి చిత్రాల్లో అద్భుత నటనతో అందరినీ ఆకట్టుకున్న ఏగన్ (Aegan) హీరోగా నటిస్తుండగా, తెలుగు ‘కోర్ట్’ (COURT) చిత్రంతో అందరినీ ఆకట్టుకున్న శ్రీదేవి (Sridevi), ‘మిన్నల్ మురళి’ ( MINNAL MURALI) ఫేమ్ ఫెమినా జార్జ్ (Femina George) ఈ చిత్రంలో కథానాయికలుగా నటించనున్నారు.
ఈ సినిమాకు సంబంధించిన విషయాలు ఈ చిత్రం గురించి మేకర్స్ ఇటీవల అధికారికంగా ప్రకటించారు. గతంలో ‘ఆహా కళ్యాణం’ అనే తమిళ వెబ్ సిరీస్ డైరెక్ట్ చేసిన యువరాజ్ చిన్నసామి (Yuvaraj Chinnasamy)ఈ చిత్రానికి దర్శకత్వం వహించనుండగా, తెలుగులో బేబీ, కోర్ట్ వంటి సినిమాలతో మంచి పేరు దక్కించుకున్న విజయ్ బుల్గానిన్ సంగీతం అందించనుండడం గమనార్హం.
‘జో’ విజయం తర్వాత మంచి కథలతో, కంటెంట్ డ్రైవెన్ సినిమాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్న నిర్మాతలు డా. డి. అరుళనందు, మాథ్యూయో అరుళనందు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించే విధంగా ఎలాంటి రాజీ పడకుండా ఈ ప్రాజెక్ట్‌ను భారీగా నిర్మించనున్నట్టు తెలిపారు. తారాగణం, సాంకేతిక నిపుణుల పూర్తి వివరాలు, కథకు సంబంధించిన ముఖ్య సమాచారం, షూటింగ్ షెడ్యూల్ వంటి అంశాలను త్వరలోనే యూనిట్ అధికారికంగా ప్రకటించనుంది.
ఇదిలాఉంటే.. శ్రీదేవి ఇప్పటికే తమిళంలో రెండు, తెలుగులో ఓ రెండు చిత్రాలు చేస్తుండగా ఇప్పుడు మరో తమిళ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి వరుస ఛాన్సులతో దూసుకుపోతుంది. మరి ఈ అమ్మడు ఏ రేంజ్‌లో తన టాలెంట్ చూసిస్తుందో ఎదురు చూడాల్సిందే.
