Court Advises: కన్నడ గురించి మాట్లాడొద్దు

ABN , Publish Date - Jul 06 , 2025 | 04:16 AM

కన్నడ గురించి మాట్లాడొద్దని నటుడు కమల్‌ హాసన్‌కు బెంగళూరు కోర్టు శుక్రవారం సూచించింది. థగ్‌లైఫ్‌ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో తమిళం నుంచి కన్నడ పుట్టిందని ఆయన చేసిన వ్యాఖ్యలు...

  • కమల్‌కు కోర్టు సూచన

కన్నడ గురించి మాట్లాడొద్దని నటుడు కమల్‌ హాసన్‌కు బెంగళూరు కోర్టు శుక్రవారం సూచించింది. థగ్‌లైఫ్‌ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో తమిళం నుంచి కన్నడ పుట్టిందని ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయిన విషయం విదితమే. కన్నడ చలనచిత్ర వాణిజ్య మండలితోపాటు కన్నడ సంఘాలు కమల్‌ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కర్ణాటకలో థగ్‌లైఫ్‌ సినిమా విడుదలకు ఆటంకాలు ఏర్పడ్డాయి. దీంతో కమల్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సినిమా విడుదలను అడ్డుకోవద్దని, తగిన బందోబస్తు కల్పించాలని సుప్రీం కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. అన్ని అడ్డంకులను దాటుకుని కర్ణాటకలో థగ్‌లైఫ్‌ రిలీజ్‌ అయినా.. ఆదరణ పొందలేదు. ఈ క్రమంలో కన్నడ గురించి అనుచితమైన వ్యాఖ్యలు చేయకుండా కమల్‌ హాసన్‌ను కట్టడి చేయాలని కన్నడ సాహిత్య పరిషత్‌ కోరింది. బెంగళూరు 31వ సిటీ సివిల్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. కన్నడ నేల, భాష, సంస్కృతి గురించి మాట్లాడకుండా చూడాలని కోరింది. పిటిషన్‌ను విచారించిన కోర్టు, కన్నడ అంశం గురించి మాట్లాడవద్దని కమల్‌ హాసన్‌ను ఆదేశించింది.

బెంగళూరు (ఆంధ్రజ్యోతి)

Updated Date - Jul 06 , 2025 | 04:16 AM