Ali: ఆ ఘనత నాకు, బ్రహ్మానందం గారికి మాత్రమే

ABN , Publish Date - Dec 23 , 2025 | 06:30 AM

మలయాళ కథానాయకుడు మోహన్‌ లాల్ (Mohanlal) టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం ‘వృషభ’.

ali

మలయాళ కథానాయకుడు మోహన్‌ లాల్ (Mohanlal) టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం ‘వృషభ’ (Vrusshabha). సమర్జిత్‌ లంకేశ్‌, రాగిణి ద్వివేది, నయన్‌ సారిక (Nayan Sarika), అజయ్‌, నేహా సక్సేనా, గరుడ రామ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. నందకిశోర్‌ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని కనెక్ట్‌ మీడియా, బాలాజీ టెలీఫిల్మ్స్‌, అభిషేక్‌ ఎస్‌ వ్యాస్‌ స్టూడియోస్‌ బ్యానర్లపై శోభా కపూర్‌, ఏక్తా ఆర్‌ కపూర్‌, సీకే పద్మకుమార్‌, వరుణ్‌ మాథుర్‌, సౌరభ్‌ మిశ్రా, అభిషేక్‌ ఎస్‌ వ్యాస్‌, ప్రవీర్‌ సింగ్‌, విశాల్‌ గుర్నాని, జూహి పరేఖ్‌ మెహతా నిర్మించారు.

ఈ నెల 25న పాన్‌ ఇండియా స్థాయిలో చిత్రం విడుదలవుతోంది. తెలుగులో గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌పై బన్నీ వాసు (Bunny Vasu) విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్‌ వేడుకలో బన్నీ వాసు మాట్లాడుతూ ‘భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘వృషభ’ విజువల్స్‌ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. మరో లోకంలోకి తీసుకెళ్తాయి. ఇందులోని భావోద్వేగాలు కదిలిస్తాయి’ అని అన్నారు.

అనంత‌రం అలీ (Ali) మాట్లాడుతూ.. తెలుగు నటులు మాత్రమే ఏ భాషలో అయినా సినిమాలు చేయగలరు. అందుకే మాకు అవ‌కాశాలు వ‌స్తున్నాయి. మనకున్న కమెడియన్స్ వేరే ఎక్కడా లేరు. మిగతా భాషల వారందరు అందరితో కలిసి నటించటానికి ముందుకు రారు. కేవలం మన దేశ భాషల్లోనే కాదు నేపాల్ సినిమాలలో కూడా నేను బ్రహ్మానందం గారు నటించాం. చిత్రీకరణకు నేను అక్కడకు రాలేనంటే.. వారే నా కోసం ఇక్కడకు వచ్చి షూటింగ్ చేశారు. అక్కడ వారికి తెలిసింది నేను బ్రహ్మానందం (Brahmanandam) మాత్రమే అని అన్నారు.

Updated Date - Dec 23 , 2025 | 06:30 AM