Cm Revanth Reddy Sukumar: సుకుమార్ కూతురు.. సుకృతిని అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి

ABN , Publish Date - Aug 19 , 2025 | 09:05 PM

దర్శకుడు సుకుమార్ దంపతులు జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

revanth

తెలుగు ప్ర‌ముఖ‌ సినీ ప్రముఖ దర్శకుడు సుకుమార్ (sukumar) దంపతులు, నిర్మాత యలమంచిలి రవిశంకర్ (Yalamanchili Ravi Shankar) కలిసి జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (cm revanth reddy) నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఇటీవ‌ల కేంద్రం ఉత్త‌మ చిత్రాల‌కు గాను జాతీయ అవార్డులు ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో తెలుగు నుంచి సుకుమార్ కుమార్తె సుకృతి (sukruti) లీడ్ రోల్‌లో న‌టించిన‌ గాంధీ తాత చెట్టు (Gandhi Thatha Chettu) సినిమాకు గాను ఉత్తమ బాలనటిగా జాతీయ అవార్డు వరించింది.

ఈ సంద‌ర్బాన్ని పుర‌స్క‌రించికుకుని రెండు రోజుల క్రితం ప‌లువురు విజేత‌లను సీఎం ప్ర‌త్యేకంగా స‌న్మానించిన విష‌యం తెలిసిందే. అయితే తాజాగా మంగ‌ళ‌వారం సుకుమార్‌ దంప‌తులు సీఎంని క‌లిసిన క్ర‌మంలో సుకృతిని సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు.సుకృతిలాంటి ప్రతిభావంతులైన బాల కళాకారులకు ప్రభుత్వం నుంచి మరింత ప్రోత్సాహం అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (cm revanth reddy) హామీ ఇచ్చారు.

Updated Date - Aug 19 , 2025 | 09:27 PM