Artist Gopalarao: సినీ, టీవీ నటుడు ఎ. గోపాలరావు మృతి

ABN , Publish Date - Jun 14 , 2025 | 11:14 AM

సినీ, టీవీ నటుడు  అల్లం గోపాలరావు (Allam gopalarao -75) శనివారం ఉదయం 8 గంటలకు అనారోగ్య కారణంగా తన నివాసంలో మృతి చెందారు



సినీ, టీవీ నటుడు  అల్లం గోపాలరావు (Allam gopalarao -75) శనివారం ఉదయం 8 గంటలకు అనారోగ్య కారణంగా తన నివాసంలో మృతి చెందారు.  ఆయనకు భార్య విమల, ఇద్దరు కుమారులు అనిల్, సునీల్ ఉన్నారు. పెద్దబాయ్ అనిల్ సీరియల్స్ తో పాటు సినిమాల్లో కూడా నటిస్తున్నారు. గోపాలరావు అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు మహాప్రస్థానంలో జరగనున్నాయి.  ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి పలువురు సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు. అలాగే ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ (FNCC) మేనేజ్మెంట్ కమిటీ గోపాలరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసింది. (Rip Allam gopalarao)

Updated Date - Jun 14 , 2025 | 11:49 AM