The Raja Saab: ప్రభాస్ ది రాజాసాబ్.. క్రిస్మస్ అప్డేట్
ABN , Publish Date - Dec 25 , 2025 | 03:40 PM
ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా నిర్మాణంలో ఏడాదిన్నరగా రూపొందుతున్న చిత్రం ది రాజా సాబ్.
ప్రభాస్ (Prabhas) హీరోగా మారుతి (Maruthi) దర్శకత్వంలో పీపుల్ మీడియా నిర్మాణంలో ఏడాదిన్నరగా రూపొందుతున్న చిత్రం ది రాజా సాబ్ (The RajaSaab). నిధి ఆగర్వాల్ (Nidhhi Agerwal), మాళవికా మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఎట్టకేలకు థియేటర్లలో విడుదలకు ముస్తబయింది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జనవరి 9న ప్రపవచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రచార కార్యక్రమాలకు సన్నద్దమవుతున్నారు.
ఈ క్రమంలో మేకర్స్ ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదల చేసిన టీజర్, పోస్టర్స్, పాటలు సినిమాపై హైప్ పెంచేశాయి. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ ఈ సినిమా నుంచి మరో అప్డేట్ ఇచ్చారు. గురువారం క్రిస్మస్ సందర్బంగా సినిమాలోని హీరోయిన్ నిధి పాత్రకు రిలేటెడ్‌గా ఉన్న 40 సెకన్ల నిడివి వీడియో ప్రోమోను రిలీజ్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ వీడియోలో ప్రభాస్ శాంతా క్లాజ్‌పైకి మంచు చల్లడం, నన్ అయిన హీరోయిన్ నిధి చర్చిలోకి వెళ్లడం, హీరో కోసం ప్రార్థించే సీన్ ఆకట్టుకునేలా ఉంది. ఈక్రమంలోరాజే యువరాజే (Raje Yuvaraje) అంటూ వచ్చే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సైతం అదిరిపోయింది.