Krishna Master: కొరియోగ్రాఫర్ కృష్ణపై పోక్సో కేసు
ABN , Publish Date - Aug 04 , 2025 | 05:54 AM
టాలీవుడ్‌లో మరో లైంగిక ఆరోపణల కేసు నమోదైంది. మైనర్ బాలికపై లైంగిక దాడి చేశాడన్న ఆరోపణలపై కొరియోగ్రాఫర్ కృష్ణ మాస్టర్‌ను...
టాలీవుడ్‌లో మరో లైంగిక ఆరోపణల కేసు నమోదైంది. మైనర్ బాలికపై లైంగిక దాడి చేశాడన్న ఆరోపణలపై కొరియోగ్రాఫర్ కృష్ణ మాస్టర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. గచ్చిబౌలి పోలీ్‌సస్టేషన్ ఇన్‌స్పెక్టర్ మహ్మద్ హబీబుల్లాఖాన్ తె లిపిన వివరాల ప్రకారం ఓ పెళ్లయిన మహిళతో కృష్ణ మాస్టర్ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడనీ, ఈ క్రమంలో ఆమె కూతురిపై కూడా కృష్ణ లైంగిక దాడి చేశాడంటూ సదరు మహిళ జూలై 9న ఫిర్యాదు చేశారు. దీంతో గచ్చిబౌలి పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. కోర్టులో హాజరు పరచిన అనంతరం రిమాండ్‌కు తరలించారు.
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి)