Godari Gattupaina: చూడు చూడు.. గోదారిగ‌ట్టు'పై నుంచి ఫీల్ గుడ్ ల‌వ్ సాంగ్‌

ABN , Publish Date - Dec 15 , 2025 | 06:31 PM

సుమంత్ ప్ర‌భాస్ (Sumanth Prabhas), నిధి ప్ర‌దీప్ (Nidhi Pradeep) జంట‌గా రూపొందుతున్న ప్రేమ‌క‌థా చిత్రం గోదారి గ‌ట్టుపైన.

Godari Gattupaina

సుమంత్ ప్ర‌భాస్ (Sumanth Prabhas), నిధి ప్ర‌దీప్ (Nidhi Pradeep) జంట‌గా రూపొందుతున్న ప్రేమ‌క‌థా చిత్రం గోదారి గ‌ట్టుపైన (Godari Gattupaina). శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం త్వ‌ర‌లో విడుద‌ల‌కు ముస్తాబ‌వుతోంది. ఈ నేప‌థ్యంలో మేక‌ర్స్ ఈ చిత్రం నుంచి ఇటీవ‌ల ఒక‌దాని త‌ర్వాత మ‌రోటి పాట‌లు విడుద‌ల చేస్తూ సినిమాపై బ‌జ్ క్రియేట్ చేస్తున్నారు.

ఈ క్ర‌మంలో తాజాగా ఈ మూవీ నుంచి చూడు చూడు (సైడ్ బీ) (Choodu Choodu (Side B)) అంటూ సాగే ఓ ఫీల్ గుడ్ ల‌వ్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. నాగ‌వంశీ (Naga Vamshi) సంగీతం అందించిన ఈ పాట‌కు దినేశ్ క‌క్క‌ర్ల ( Dinesh Kakkerla) సాహిత్యం అందించ‌గా హ‌రిణి ఇవ‌టూరి (Harini Ivaturi)ఆల‌పించింది. విజువ‌ల్‌గా కూడా పాట బావుంది. త్వ‌ర‌గానే ఈ గీతం టాప్‌లోకి వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఇదిలాఉంటే ఈ సినిమాలో జ‌గ‌ప‌తిబాబు, లైలా, రాజీవ్ క‌న‌కాల‌, వంటి న‌టులు కీల‌క పాత్ర‌లు చేస్తుండ‌డం విశేషం.

Updated Date - Dec 15 , 2025 | 06:31 PM