Venu Donepudi: చిత్రాలయం కొత్త సినిమా

ABN , Publish Date - Aug 07 , 2025 | 03:31 AM

చిత్రాలయం స్టూడియోస్‌ బేనర్‌పై వేణు దోనెపూడి నిర్మాతగా గుణి మంచికంటి దర్శకత్వంలో కొత్త సినిమా ప్రారంభమైంది. ఈ చిత్రానికి కొండల్‌ జిన్నా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు...

చిత్రాలయం స్టూడియోస్‌ బేనర్‌పై వేణు దోనెపూడి నిర్మాతగా గుణి మంచికంటి దర్శకత్వంలో కొత్త సినిమా ప్రారంభమైంది. ఈ చిత్రానికి కొండల్‌ జిన్నా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రారంభోత్సవానికి చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి రమేశ్‌ ప్రసాద్‌ అక్కినేని స్ర్కిప్ట్‌ను అందించగా, ఆదిశేషగిరి రావు క్లాప్‌ కొట్టారు. కె.ఎ్‌స.రామారావు కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. పి. మహేశ్‌ బాబు గౌరవ దర్శకత్వం వహించారు. నేపాల్‌ రాజవంశానికి చెందిన సమృద్ధి ఈ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. టిను ఆనంద్‌, ఉపేంద్ర, జార్జ్‌ మరియన్‌ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Updated Date - Aug 07 , 2025 | 03:31 AM