Shivaji: అప్పుడు.. మన దర్శకులకు నేను కనిపించలేదేమో  

ABN , Publish Date - Dec 16 , 2025 | 06:02 PM

ఇప్పుడు నాకు కాలం కలిసి వచ్చిందేమో. అలా అని ప్రస్తుతం అన్నీ ఒకే రకమైన పాత్రల్ని కూడా సెలెక్ట్ చేసుకోవడం లేదు. నేను ఇప్పుడు కొత్త దర్శకులతో పని చేస్తున్నాను. మన మేకర్స్ ఎక్కువగా లెక్కలు వేసుకుంటూ ఉంటారు.

‘కోర్ట్‌’లో మంగపతి పాత్రకు ఎంత రెస్పాన్స్ వచ్చిందో అంతే రెస్పాన్స్ ‘దండోరా’లోని పాత్రకి కూడా వస్తుంది. నటుడిగా ఎంతో అదృష్టం ఉంటే తప్పా ఇలాంటి పాత్రలు రావు. ఇందులో డిఫరెంట్ షేడ్స్ ఉన్న కారెక్టర్ లభించింది. అద్భుతమైన కంటెంట్‌తో ఎమోషనల్‌గా సాగే చిత్రమిది' అని శివాజీ అన్నారు.  ఆయన ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ‘దండోరా’. న‌వ‌దీప్‌, నందు, ర‌వికృష్ణ‌, మ‌నికా చిక్కాల‌, మౌనికా రెడ్డి, బిందు మాధ‌వి, రాధ్య‌, అదితి భావ‌రాజు త‌దిత‌రులు ముఖ్య పాత్రల్ని పోషించారు. మురళీకాంత్ దర్శకత్వం వహించారు. ర‌వీంద్ర బెన‌ర్జీ ముప్పానేని నిర్మాత. డిసెంబర్ 25న భారీ ఎత్తున విడుదల కానుంది. ఈ సందర్భంగా శివాజీ మీడియాతో ముచ్చటించారు 


ఇలాంటి పాత్రలు చాలా అరుదు

కోర్ట్ కన్నా ముందే ఈ కథ విన్నాను. ఇందులో నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. ఈ సినిమా నిర్మాతలు ముందే అడ్వాన్స్ ఇచ్చారు. ప్రొడక్షన్ పరంగా సినిమా ఆలస్యమైంది. దానితో  ‘కోర్ట్’ ముందు రిలీజ్ అయింది. ఇందులో నా పాత్ర డిఫరెంట్‌గా ఉంటుంది. మంచోడా? చెడ్డోడా? అని చూసే ప్రేక్షకుడికి సరిగ్గా అర్థం కాదు. సినిమా చూసిన తరువాత ఆడియెన్స్ నా పాత్ర గురించి చెప్పాల్సి ఉంటుంది. ఈ చిత్రంలో నేను వ్యవసాయదారుడిగా కనిపిస్తాను. అన్ని కారెక్టర్స్ నా చుట్టూనే తిరుగుతాయి. అంత ఇంపార్టెన్స్ ఉన్న పాత్ర నాది. ఇలాంటి చిత్రాలు, కథలు, పాత్రలు చాలా అరుదుగా వస్తుంటాయి. ఏదో అలా వచ్చి వెళ్లినట్టుగా ఏ పాత్ర కూడా ఉండదు. అన్ని రకాల కమర్షియల్ అంశాలను జోడించి తెరకెక్కించిన చిత్రమిది. ఇందులో గొప్ప స్క్రీన్ ప్లే ఉంటుంది. ఇందులో బిందు మాధవి పాత్రను చాలా క్లాసీగా చూపించారు. ప్రతీ ఒక్కరూ సినిమాతో, పాత్రలతో కనెక్ట్ అవుతారు.

మన మేకర్స్ లెక్కలు వేసుకుంటారు

‘మిస్సమ్మ’, ‘శైలజా కృష్ణమూర్తి’, ‘అదిరిందయ్య చంద్రం’ ఇలా అన్ని రకాల చిత్రాల్ని ఎంజాయ్ చేశాను. అయితే నటుడిగా నా మీద నాకు నమ్మకం ఉండేది. కామెడీ, నెగెటివ్ షేడ్స్ ఇలా అన్ని రకాల పాత్రల్ని పోషించగలను. ఇప్పుడు నాకు కాలం కలిసి వచ్చిందేమో. అలా అని ప్రస్తుతం అన్నీ ఒకే రకమైన పాత్రల్ని కూడా సెలెక్ట్ చేసుకోవడం లేదు. నేను ఇప్పుడు కొత్త దర్శకులతో పని చేస్తున్నాను. మన మేకర్స్ ఎక్కువగా లెక్కలు వేసుకుంటూ ఉంటారు. మన దగ్గర ఎంతో పొటెన్షియల్ యాక్టర్స్ ఉన్నా కూడా పక్క భాషల నుంచి తీసుకు వస్తుంటారు. ఇందులో నవదీప్, నందు, రవికృష్ణ ఇలా అందరూ అద్భుతమైన ఆర్టిస్టులే. ఇక్కడ మన వాళ్ల గురించి మనమే తక్కువ అంచనా వేసుకుంటాం. 30 ఏళ్ల నుంచి నేను ఇక్కడే ఉన్నాను. ఇది వరకు ఎన్నో నెగెటివ్ పాత్రలు పోషించాను. కానీ మన దర్శకులకు నేను ఎక్కువగా కనిపించలేదేమో. ఇప్పుడు కొత్త దర్శకులు నాలోని నటుని బాగా ఉపయోగించుకుంటున్నారు. తదుపరి నా నుంచి  ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ అనే చిత్రం రాబోతోంది. ఆదిత్య హాసన్ దర్శకత్వంలో రానున్న ‘ఎపిక్’ అద్భుతంగా ఉండబోతోంది. ప్రతీ ఫ్యామిలీ, తండ్రీకొడుకులకు కనెక్ట్ అయ్యే ఎన్నో అద్భుతమైన సన్నివేశాలతో ‘ఎపిక్’ ఉంటుంది.

Updated Date - Dec 16 , 2025 | 07:43 PM