Sapthami Gowda: రత్న పవన్ అభిమానిని.. పాత్ర ఎలా ఉంటుందంటే..
ABN , Publish Date - Jul 01 , 2025 | 06:30 PM
‘కాంతార’ సినిమా తర్వాత దర్శకుడు శ్రీరామ్ వేణు దగ్గర నుంచి కాల్ వచ్చింది. హైదరాబాద్ వచ్చి లుక్ టెస్ట్ ఇచ్చాను. ఓకే అయ్యాక, డైలాగ్ వెర్షన్ చెప్పారు. అప్పటికే రత్న క్యారెక్టర్ గురించి కంప్లీట్ గా స్క్రిప్ట్ ఉంది.
'తమ్ముడు తెలుగులో నా తొలి సినిమా. ఇందులో నిడివి పెద్దది కాకపోవచ్చు. కానీ పాత్రలో ఉన్న డెప్ట్ చాలా ప్రభావం చూపుతుంది. అంతే కాదు పాత్రకు ప్రాధాన్యం కూడా ఉంది' అని సప్తమీ గౌడ అన్నారు. నితిన్ నటించిన తమ్ముడు చిత్రంలో ఆమె ఓ కథానాయిక. శ్రీరామ్ వేణు దర్శకద్వంలో దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. లయ, వర్ష బొల్లమ్మ ఇతర పాత్రధారులు. ఈ నెల 4న వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఇందులో రత్న పాత్ర పోషించిన సప్తమీ గౌడ విలేకర్లతో మాట్లాడారు.
‘కాంతార’ సినిమా తర్వాత దర్శకుడు శ్రీరామ్ వేణు దగ్గర నుంచి కాల్ వచ్చింది. హైదరాబాద్ వచ్చి లుక్ టెస్ట్ ఇచ్చాను. ఓకే అయ్యాక, డైలాగ్ వెర్షన్ చెప్పారు. అప్పటికే రత్న క్యారెక్టర్ గురించి కంప్లీట్ గా స్క్రిప్ట్ ఉంది. ఇందులో నాకు, నితిన్ లవ్ ట్రాక్ ఉంటుంది. మా టీనేజ్ ప్రేమ తర్వాత మరింత పరిణితి చెందుతుంది. మూవీలో రత్న, నితిన్ క్యారెక్టర్ కలవాలని ప్రేక్షకులు కోరుకుంటారు. నా తొలి తెలుగు చిత్రం దిల్ రాజు గారి బ్యానర్‌లో చేయడం హ్యాపీగా ఉంది. దాని కోసం హార్స్ రైడింగ్ నేర్చుకోమన్నారు. అరకులో ఎక్కువ షూటింగ్ చేశాం. నితిన్ గారి భుజానికి గాయం వల్ల షూటింగ్ కొంత ఆలస్యమైంది. ఈ సినిమా నాకు మంచి అనుభవం, అనుభూతినిచ్చింది.
గురప్రు స్వారీ.. చాలా కష్టం..
ఈ సినిమాలో అంబరగొడుగు అనే ఊరిలో రత్న అనే అమ్మాయి క్యారెక్టర్ నాది. తను పవన్ కల్యాణ్ అభిమాని. ఆ పాత్రకు ఒక డిఫరెంట్ లవ్‌స్టోరీ కూడా ఉంటుంది. కాంతారతో చూస్తే లుక్ వైజ్ నా క్యారెక్టర్ ఒకేలా ఉంది అనిపించవచ్చు కానీ క్యారెక్టర్‌గా చూస్తే పూర్తిగా భిన్నమైనది. ‘తమ్ముడు’ కాస్త సీరియస్ సబ్జెక్ట్.. ఇందులో నా క్యారెక్టర్ ద్వారా ఫన్ క్రియేట్ అవుతుంది. లయ, నితిన్ గారు కొన్ని పరిస్థితుల్లో అంబరగొడుగు అనే ఊరికి వస్తారు. వారి జర్నీలో రత్న ఎలా భాగమైంది అనేది ఆసక్తికరంగా ఉంటుంది. నితిన్, లయ గారు ఉన్న సిచ్యువేషన్ తెలియకుండా వారితో నా తరహాలో జోవియల్‌గా ఉంటాను. అది ఆడియన్స్‌కు హ్యూమర్ పంచుతుంది. రత్న రేడియో జాకీ కాదు. తను పాత్ర ఎలా ఉంటుందో సినిమాలో చూడాలి. కొండలు, గుట్టల్లాంటి ప్రాంతంలో హార్స్ రెడింగ్ చేయాల్సి వచ్చింది. రోజూ మూడు, నాలుగు గంటలు హార్స్ రైడింగ్ చేయడంతో ఇబ్బందిపడ్డాను. కానీ ఆ సన్నివేశాలన్నీ బాగా వచ్చాయనే సంతృప్తి ఉంది.
నటిగా పేరు పక్కా..
పవన్ కల్యాణ్ నటించిన తమ్ముడు సినిమా గురించి నాకు ఐడియా ఉంది. ఆ సినిమా ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలుసు. నేను ఆ సినిమాను పూర్తిగా చూడలేదు. ఈ సినిమా రిలీజ్ లోపు చూస్తాను.
ఇప్పుడు నేను నటించిన ‘తమ్ముడు’ నటిగా నాకు తప్పకుండా మంచి పేరు తెస్తుంది. ఈ చిత్రంలో నాది లెంగ్తి రోల్ కాదు, కానీ ఇంపాక్ట్ ఫుల్ క్యారెక్టర్. రత్న క్యారెక్టర్ రాసేటప్పుడు మిగతా పాత్రలకంటే ఎంజాయ్ చేశానని డైరెక్టర్ వేణు గారు చెప్పేవారు. ఈ సినిమాకు ఫస్ట్ సెలెక్ట్ అయిన ఆర్టిస్ట్ నేనే.
హీరోతో సాంగ్స్ కాదు..
ఇందులో నేను, లయ, దిత్య, వర్ష, స్వసిక.. మా అందరి పాత్రలకు చక్కని ప్రాధాన్యం ఉంటుంది. డిఫరెంట్‌గా, పవర్‌ఫుల్‌గా ఉంటాయి. లయ గారు ఇందులో స్ర్టిక్ట్ ఆఫీసర్‌గా కనిపిస్తారు. నేను, వర్ష.. ఇలా మా అందరికీ ఫైట్ సీక్వెన్స్ ఉన్నాయి. సినిమాల్లో హీరోతో సాంగ్స్ పాడే హీరోయిన్ క్యారెక్టర్స్ చూస్తుంటాం. కానీ ఇందులో ఫైట్ చేేస హీరోయిన్స్‌ను చూస్తారు. వుమెన్ క్యారెక్టర్స్‌ను ఇంత బలంగా తెరకెక్కించినందుకు రేపు థియేటర్స్‌లో ‘తమ్ముడు’ సినిమా చూసే మహిళా ప్రేక్షకులు చాలా హ్యాపీగా ఫీలవుతారు.
అవకాశాలు అందుకే వదులుకున్నా..
కమర్షియల్ సినిమాలంటే నాకు ఇష్టం. ఇదీ కూడా పక్కా కమర్షియల్ సినిమానే. పుష్ప లో రశ్మిక చేసిన పాత్ర నాకు చాలా నచ్చింది. అలాంటి ఆఫర్స్ వస్తే చేేసందుకు సిద్థంగా ఉన్నాను. కాంతార సక్సెస్ తర్వాత నాకు అలాంటి క్యారెక్టర్స్ ఆఫర్ చేశారు. అందుకే చాలా మూవీస్ వదులుకున్నాను. ఎక్కువ చిత్రాల్లో కనిపించకపోవడానికి కారణమదే. డిఫరెంట్ రోల్స్ వస్తే తప్పకుండా చేస్తా. ప్రస్తుతం తెలుగలో మరో రెండు చిత్రాలతోపాటు తమిళంలో, కన్నడలో సినిమాలు చేస్తున్నా.