Anushka: కుదిరితే ఆ తరహా పాత్ర చేయాలని ఆశగా ఉంది..

ABN , Publish Date - Sep 03 , 2025 | 11:07 PM

నటిగా రెండు దశాబ్లాలు పూర్తయింది. ఈ జర్నీలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేశాను. ఇప్పుడు ఘాటి కూడా ఆ తరహా చిత్రమే. ఒక అడ్వెంచర్‌ సినిమా ఇది. విడుదల కోసం ఎంతో ఎగైటింగ్‌గా ఎదురుచూస్తున్నా.

అనుష్క శెట్టి (Anushka) ప్రధాన పాత్ర పోషించిన చిత్రం 'ఘాటి'(Ghaati). విక్రమ్‌ ప్రభు కీలక పాత్రలో క్రిష్‌ దర్శకత్వం వహించిన చిత్రమిది. ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై రాజీవ్‌ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మించారు. సెప్టెంబర్‌ 5న ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది. ఈనేపథ్యంలో అనుష్క విలేకర్లతో మాట్లాడారు.

నటిగా రెండు దశాబ్లాలు పూర్తయింది. ఈ జర్నీలో ఎన్నో వైవిఽధ్యమైన పాత్రలు చేశాను. ఇప్పుడు ఘాటి కూడా ఆ తరహా చిత్రమే. ఒక అడ్వెంచర్‌ సినిమా ఇది. విడుదల కోసం ఎంతో ఎగైటింగ్‌గా ఎదురుచూస్తున్నా. అరుంధతీ, రుద్రమదేవి, బాహుబలి, భాగమతి.. ఈ సినిమాలన్నిటిలోనూ చాలా బలమైన పాత్రలు చేశా. ఇందులో శీలావతి అమేజింగ్‌ క్యారెక్టర్‌. ఇలాంటి క్యారెక్టర్‌ను గతంలో ఎప్పుడూ చేయలేదు. బ్యూటిఫుల్‌ షేడ్స్‌ ఉన్న క్యారెక్టర్‌. కంఫర్ట్‌ జోన్‌ని దాటి చేసిన సినిమా ఇది. ప్రతి మహిళ సింపుల్‌గా సున్నితంగా కనిపిస్తున్నప్పటికీ ఏదైనా ఒక సిచువేషన్‌ వచ్చినప్పుడు ఒక బలమైన పిలర్‌లా నిలబడతారు. మహిళల్లో ఉండే గొప్ప క్వాలిటీ అది. క్రిష్‌ గారు అలాంటి ఒక పాత్రతో ఈచిత్రాన్ని తీశారు. క్రిష్‌, రచయిత శ్రీనివాస్‌ ఈ కథ చెప్పినప్పుడు ఆ కల్చర్‌ చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. లొకేషన్స్‌కి వెళ్ళిన తర్వాత ఒక కొత్త క్యారెక్టర్‌, కల్చర్‌, ఒక కొత్త విజువల్‌ని ఆడియన్స్‌కి చూపించబోతున్నామనే ఎగ్జైట్‌మెంట్‌ కలిగింది.

వేదం తర్వాత క్రిష్‌తో చేస్తున్న రెండో సినిమా ఇది. వేదంలో సరోజ పాత్రకి కొనసాగింపుగా ఒక సినిమా చేద్దాం అనుకున్నాం. కానీ ఆర్గానిక్‌గా ఏదైనా ఒక కథ వస్తే బాగుంటుందని ఎదురుచూశాం. అలాంటి సమయంలో ఘాటి లాంటి అద్భుతమైన కథ కుదిరింది. క్రిష్‌ గారు నాకు ఎప్పుడు కూడా చాలా అద్భుతమైన పాత్రలు రాస్తారు. ఇందులో శీలావతి క్యారెక్టర్‌ నా ఫిల్మోగ్రఫీలో ఎప్పటికీ నిలిచిపోతుంది. క్రిష్‌ ఎప్పుడు సోషల్‌గా రెలెవెంట్‌ ఉండే కథలనే ఎంచుకుంటారు. సొసైటీలో ఉండే సీరియస్‌ ఇష్యూ ఇది. మేము ఈ సినిమాని యాక్షన్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా తీశాం. ఐతే ఈ కథలోనే చక్కని సందేశం కూడా ఉంది. అది చాలా పాజిటివ్‌గా ఉంటుంది. నాపై నమ్మకంతో నిర్మాతలు రాజీవ్‌ రెడ్డి, యు.వి క్రియేషన్స్‌ డిఫరెంట్‌ కథతో వచ్చారు. బడ్జెట్‌ లెక్క చేయలేదు. వారితో జర్నీ ఎప్పుడూ బాగానే ఉంటుంది.


నేను నటించిన చిత్రాలన్నీ కష్టంతో కూడుకున్నవే. అంత ఈజీగా ఏ సినిమా కాలేదు. ఇందులో కూడా ఫిజికల్‌ హార్డ్‌వర్క్‌ చాలా చేశా. కొత్త లొకేషన్స్‌లో షూట్‌ చేయడం చాలా ఎగ్జైటింగ్‌గా అనిపించింది. అయితే క్రిష్‌ షూటింగ్‌ చాలా చక్కగా ప్లాన్‌ చేశారు. అలాంటి కొత్త లొకేషన్స్‌ షూట్‌ చేయడం మెమరబుల్‌ ఎక్స్‌ పీరియన్స్‌.

విక్రమ్‌ ప్రభు నాకు చాలా బాగా తెలుసు. ఆయన నటించిన కుమ్కీ చిత్రమంటే నాకెంతో ఇష్టం. చాలా ఇంటెలిజెంట్‌ పర్సన్‌. దేశిరాజు పాత్రకు ఆయన పక్కాగా యాప్ట్‌ అయ్యారు. ఇక మనోజ్‌ కెమెరా, సాగర్‌ సంగీతం సినిమాకు బోనస్‌. ఇందులో మ్యూజిక్‌ కూడా ఒక క్యారెక్టర్‌లాగా ఉంటుంది. క్రిష్‌ ఇందులో పాటలు కూడా రాశారు. ఆయన చిన్నచిన్న మాటలతో కథలో గొప్ప డెప్త్‌ని తీసుకొస్తారు.

సోషల్‌ మీడియాలో అంతగా యాక్టివ్‌గా ఉండను. జనాలతో ఎక్కువ ఇంటరాక్ట్‌ కాను. నేను చాలా ఎక్కువ ట్రావెల్‌ చేస్తాను. చదువుతాను. ప్రస్తుతం మహాభారతం చదువుతున్నాను. మూవీస్‌ కూడా చూస్తాను. గత రెండేళ్లుగా ఎక్కువగా ఫ్యామిలీతో సమయం గడుపుతున్నాను.

ప్రస్తుతం కొత్త కథలు వింటున్నా. మంచి లైనప్‌ ఉంది. మలయాళంలో ఓ సినిమా చేస్తున్నాను. అది నా ఫస్ట్‌ మలయాళం సినిమా. తెలుగులో కొత్త సినిమా ప్రకటన ఉంది. అది చాలా ఇంట్రెస్టింగ్‌ కథ. కుదిరితే అవుట్‌ అండ్‌ అవుట్‌ నెగిటివ్‌ క్యారెక్టర్‌ చేయాలనుంది.

Updated Date - Sep 03 , 2025 | 11:10 PM