Chiranjeevi: అన్న‌పూర్ణ‌లో ప‌వ‌న్‌.. స‌డ‌న్‌గా షాకిచ్చిన మెగాస్టార్‌

ABN , Publish Date - Jul 02 , 2025 | 09:07 AM

ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ మూవీ షూటింగ్ ప్ర‌స్తుతం అన్న‌పూర్ణ‌ స్టూడియోలో శ‌ర‌వేగంగా సాగుతుండ‌గా ప‌వ‌న్‌, శ్రీలీల ప్ర‌ధాన తారాగ‌ణం అంతా పాల్గొన్నారు.

chiranjeevi

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) రాజకీయాల్లోకి వచ్చాక అధికారంలోకి రావ‌డం, డిప్యూటీ సీఎం కావ‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోయిన విష‌యం తెలిసిందే. ఈక్ర‌మంలో వాయిదా ప‌డ్డ సినిమాల‌ను పూర్తి చేసే ప‌నిలో ఉన్న ఆయ‌న ఇప్పుడు వాటి చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉండ‌గా హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు (HariHara Veeramallu), ఓజీ (OG) చిత్రాల షూటింగ్‌ల‌ను పూర్తి చేశారు. ఆపై చివ‌ర‌గా బ్యాలెన్స్ ఉన్న ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ (Ustaad Bhagat Singh) సినిమా షూటింగ్‌లో ఇటీవ‌లే అడుగు పెట్టాడు.

హరీష్ శంకర్(Harish Shankar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) నిర్మిస్తుంది. పవన్ సరసన శ్రీలీల(Sreeleela) నటిస్తోంది. కోలీవుడ్‌లో భారీ విజయాన్ని అందుకున్న తేరి (Theri) సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న ఆ చిత్రం లైన్‌ను మాత్ర‌మే తీసుకుని హరీష్.. తన స్టైల్ లో రూపొందిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన  పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి కూడా.

chiru.jpg

అయితే తాజాగా ప్రారంభ‌మైన ఈ మూవీ షూటింగ్ శ‌ర‌వేగంగా సాగుతుండ‌గా ప‌వ‌న్‌, శ్రీలీల ప్ర‌ధాన తారాగ‌ణం అంతా పాల్గొన‌గా ప్ర‌స్తుతం అన్న‌పూర్ణ‌ స్టూడియోలో షూటింగ్ జ‌రుగుతుంది. ఈ క్ర‌మంలో ఈ సినిమా సెట్‌కు చిరంజీవి (Chiranjeevi) స‌డ‌న్‌గా ఎంట్రీ ఇచ్చి అక్క‌డి వారిని అశ్చ‌ర్య ప‌రిచారు. ప‌వ‌న్‌తో క‌లిసి సెట్‌లో క‌లియ తిరిగారు ఆపై తమ్ముడు పవన్ నటనను, మూవీ చిత్రీకరణ తీరును ఆయన దగ్గరుండి గ‌మ‌నించారు. ప‌వ‌న్‌తో కాసేపు ముచ్చ‌టించారు. ఆపై అంద‌రికి ఆల్ ది బెస్ట్ చెప్పి అక్క‌డి నుంచి వెళ్లి పోయారు. ఇందుకు సంబంధించిన ఫొటో బ‌య‌ట‌కు రావ‌డంతో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ఫొటో హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

Updated Date - Jul 02 , 2025 | 09:07 AM