Vishwambhara Book: విశ్వ వేదికపై.. విశ్వంభర! సరిహద్దులు దాటిన మెగా మాస్
ABN , Publish Date - May 22 , 2025 | 05:47 PM
మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' ఎక్స్‌క్లూజివ్ ఎపిక్ బుక్‌ను కాన్స్‌లో లాంచ్ చేసిన నిర్మాత విక్రమ్ రెడ్డి
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా బింబిసార ఫేం వశిష్ట (Vassista) దర్శకత్వంలో రూపొందుతున్న సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ (Vishwambhara). త్రిష (Trisha) కథానాయిక కాగా అషికా రంగనాథ్, రమ్య పసుపులేటి కీలక పాత్రలు పోషిస్తున్నారు. యు.వి.క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ కృష్ణా రెడ్డి, విక్రమ్ రెడ్డి, ఉప్పలపాటి ప్రమోద్ నిర్మిస్తున్నారు. అస్కార్ విన్నర్ కీరవాణి సంగీతంలో ఇటీవల విడుదల చేసిన రామ రామ పాట తెలుగు నాట సెన్షేషన్ క్రియేట్ చేస్తోంది. అయితే తాజాగా విశ్వంభర నిర్మాత కేన్స్ (2025 Cannes Film Festival) లో దర్శణమిచ్చి ప్రపంచ సినీ వేదికపై ‘విశ్వంభర’ చిత్రానికి అంతర్జాతీయ గుర్తింపు వచ్చేలా చేశారు.
బుధవారం రాత్రి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరయిన నిర్మాత.. ‘విశ్వంభర’ చిత్రానికి సంబంధించిన ఒక ప్రత్యేక పుస్తకాన్ని ఆవిష్కరించబోతున్నాం.. #WhatIsInsideVishwambharaBook అనే ప్రశ్నతో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఇది “యూనివర్స్ కి మించిన మెగా మాస్” అనుభూతిని ఇస్తుందని చిత్ర బృందం పేర్కొంది. అన్నట్లుగానే మూవీ నిర్మాతల్లో ఒకరైన విక్రమ్ రెడ్డి ప్రతిష్టాత్మక కేన్స్ ఫిలిం ఫెస్టివల్ (2025 Cannes Film Festival) లో పాల్గొని విశ్వంభర బుక్ ఆవిష్కరించి అందరినీ అశ్చర్య పరిచారు. ఈ సందర్భంగా జరిగిన ఈవెంట్ లో ఆయన సినిమా కథ, భారతీయ పురాణాల ప్రాధాన్యత, బుక్ విశేషాలు గురించి వివరించారు. అలాగే సినిమా స్థాయి, హాలీవుడ్‌లోని టాప్ VFX స్టూడియోల సహకారం గురించి వివరించారు.
ఇక.. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇప్పటికే 90% పోస్ట్-ప్రొడక్షన్ మరియు VFX పనులు పూర్తయినట్లు మేకర్స్ తెలిపారు. చిరంజీవి (Chiranjeevi) ఇంతకుముందు ఎన్నడూ కనిపించని సరికొత్త అవతారంలో కనిపించనుండగా.. యూవీ క్రియేషన్స్(UV Creations) సంస్థ దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్‌తో, అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ ‘విశ్వంభర’ (Vishwambhara) సినిమాను జూలై చివరి వారంలో గానీ ఆగష్టులో గానీ థియేటర్లలోకి తీసుకురానున్నారు.