Shankar Varaprasad: శంకర వరప్రసాద్.. పండగకి వస్తున్నారు! వీరయ్యతో మరోసారి
ABN , Publish Date - Aug 23 , 2025 | 04:53 AM
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో మెగా157 అనే వర్కింగ్ టైటిల్‌తో సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. చిరంజీవి సరసన కథానాయికగా నయనతార నటిస్తున్నారు. సాహు గారపాటి, సుస్మిత కొణిదెల ..
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ‘మెగా157’ అనే వర్కింగ్ టైటిల్‌తో సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. చిరంజీవి సరసన కథానాయికగా నయనతార నటిస్తున్నారు. సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. చిత్రీకరణ తుది దశలో ఉంది. వచ్చే సంక్రాంతికి థియేటర్లలోకి రానుంది. శుక్రవారం చిరంజీవి పుట్టిన రోజు. ఈ సందర్భంగా మేకర్స్ ఈ చిత్రం టైటిల్‌ను ప్రకటించారు. ‘మన శంకర వరప్రసాద్ గారు’ అనే టైటిల్‌ను ఖాయం చే శారు. ‘పండగకి వస్తున్నారు’ అనేది దీని ట్యాగ్‌లైన్. టైటిల్ గ్లింప్స్‌లో... బాస్ అంటూ వచ్చే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో చిరంజీవి కొత్త మేకోవర్‌లో కనిపించారు. సూట్‌లో స్టయిల్‌గా సిగరేట్ తాగుతూ.. చేతిలో తుపాకీతో ఓ సీన్‌లో కనిపించారు. మరో సీన్‌లో గుర్రాన్ని నడిపిస్తూ సిగరేట్ కాలుస్తూ వింటేజ్ లుక్‌లో మైమరపించారు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌లో ‘రౌడీ అల్లుడు’ ట్యూన్‌తో చిరంజీవి ఎంట్రీ అదిరిపోయింది. చివర్లో మన శంకరప్రసాద్ గారు..పండగకి వస్తున్నారు అంటూ హీరో వెంకటేశ్ వాయిస్ ఓవర్‌తో టైటిల్‌ని అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ ‘చిరంజీవిని మీరు ఎలా చూడాలనుకుంటున్నారో సంక్రాంతికి రెండింతలు చూస్తారు. పాటలు, వినోదం అన్నీ అద్భుతంగా కుదిరాయి’ అని అన్నారు. నిర్మాత సాహు గారపాటి మాట్లాడుతూ ‘చిరంజీవి సినిమాలను నేను, అనిల్ ఎలా చూస్తామో, ఎలా చూడాలనుకుంటున్నామో అలానే ఇందులో ఆయనను చూపించబోతున్నాం’ అని అన్నారు. మరో నిర్మాత సుస్మిత కొణిదెల మాట్లాడుతూ ‘నాన్నగారి పుట్టిన రోజున ఆయనతో లేకుండా మీ అందరి ముందు ఇలా ఉండటం బహుశా ఇదే మొదటిసారి. ఇవి నాకు మధుర క్షణాలు. మీ అందరి సపోర్టు కావాలి’ అని అన్నారు.
వీరయ్యతో మరోసారి
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇదే కాంబినేషన్ మరోసారి తెరపై ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు సిద్ధమవుతోంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని భారీగా నిర్మించనుంది. ఈ ప్రాజెక్టుకు ‘మెగా 158’ అని వర్కింగ్ టైటిల్ పెట్టారు. ఈ మేరకు అధికారికంగా ప్రకటిస్తూ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ని విడుదల చేశారు. పోస్టర్‌లో నెత్తురు-గొడ్డలిని చూస్తుంటే యాక్షన్ మూవీలా అనిపిస్తోంది. ఈ ఏడాది చివర్లో షూటింగ్ మొదలు కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను తర్వాత వెల్లడించనున్నట్లు నిర్మాణ సంస్థ పేర్కొంది.