Mana Shankara Varaprasad Garu: మాస్‌ సాంగ్‌.. చిరు, వెంకీ స్టెప్స్

ABN , Publish Date - Dec 01 , 2025 | 05:15 AM

‘మన శంకర వరప్రసాద్‌ గారు’ చిత్రం గురించి ఓ ఆసక్తికరమైన అప్డేట్‌ ఇచ్చారు మేకర్స్‌. ఈ అగ్రహీరోలిద్దరూ ఓ గీతానికి కాలు కదపనున్నట్లు తెలిపారు.

Mana Shankara Varaprasad Garu

చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా అనిల్‌ రావిపూడి (Anil Ravipudi) తెరకెక్కిస్తున్న ‘మన శంకర వరప్రసాద్‌ గారు’ (Mana Shankara Varaprasad Garu) షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. హీరో వెంకటేశ్ (Venkatesh) ఈ చిత్రంలో ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన అప్డేట్‌ ఇచ్చారు మేకర్స్‌. ఈ అగ్రహీరోలిద్దరూ సినిమాలో ఓ గీతానికి కాలు కదపనున్నట్లు తెలిపారు.

ఈ క్రమంలోనే ఓ అదిరిపోయే మాస్‌ గీతాన్ని భారీ సెట్‌ వేసి షూట్‌ చేస్తున్నారు. దాదాపు 500 మంది డ్యాన్సర్లతో కలర్‌ఫుల్‌గా ఈ పాటను చిత్రీకరిస్తున్నారు. విజయ్‌ పొలకి ఈ పాటకు కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ మాస్‌ గీతం వచ్చే ఏడాది విడుదలయ్యే ఉత్తమ పాటల్లో ఒకటిగా నిలిచిపోతుంది, వీరిద్దరి ఎనర్జీ, స్టైల్‌ ప్రేక్షకులకు అద్భుతమైన వినోదం అందించనుందని మేకర్స్‌ చెప్పారు.

Mana Shankara Varaprasad Garu

వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రం విడుదల కానుంది. షైన్ స్క్రీన్స్‌, గోల్డ్‌ బాక్స్‌ ఎంటర్టైన్‌మెంట్స్‌ బేనర్‌పై సాహు గారపాటి, చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. నయనతార కథానాయిక. ఈ చిత్రానికి ఎడిటర్‌: తిమ్మరాజు, సినిమాటోగ్రఫీ: సమీర్‌ రెడ్డి, సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో.

Updated Date - Dec 01 , 2025 | 06:19 AM