Mana Shankara Vara Prasad Garu: మెగా - విక్టరీ మాస్ సాంగ్.. వచ్చేస్తోంది! ఎప్పటి నుంచంటే
ABN , Publish Date - Dec 27 , 2025 | 06:32 AM
ఇద్దరు దిగ్గజ హీరోలు చిరంజీవి, వెంకటేశ్ కలిసి స్టెప్పులేసిన మాస్ సాంగ్ అప్డేట్ వచ్చేసింది.
తెలుగు చిత్ర పరిశ్రమలోని ఇద్దరు దిగ్గజ హీరోలు చిరంజీవి (Chiranjeevi), వెంకటేశ్ (Venkatesh) కలిసి నటిస్తున్న క్రేజీ మల్టీస్టారర్ ‘మన శంకర వరప్రసాద్ గారు’(Mana Shankara Vara Prasad Garu). అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. చిరంజీవి, వెంకటేశ్ అభిమానుల ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తూ చిత్ర యూనిట్ శుక్రవారం ఓ అప్‌డే ట్‌ను పంచుకుంది.
ఈ చిత్రంలోని మూడో పాటను ఈ నెల 30న విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ‘మెగా విక్టరీ మాస్ సాంగ్’ పేరుతో వస్తున్న ఈ పాట న్యూ ఇయర్ వేడుకల్లో అభిమానుల ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తుందని యూనిట్ పేర్కొంది. ఈ పాటకు సంబంధించిన ప్రోమోను నేడు విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో చిరు, వెంకీ తమదైన స్టైల్‌తో అదరగొట్టారు.
డెనిమ్ కాంబినేషన్, కూలింగ్ గ్లాసె్‌సతో చిరంజీవి తన వింటేజ్ లుక్‌ను గుర్తు చేశారు. రెడ్ జాకెట్‌లో వెంకటేశ్ ఎనర్జిటిక్‌గా, స్టన్నింగ్ లుక్‌లో కనిపించారు. భారీ సెట్ వందలాది మంది డాన్సర్ల మధ్య ఈ ఇద్దరు హీరోలు వేసిన స్టైలిష్ స్టెప్పులు ఈ సాంగ్ ఏ రేంజ్‌లో ఉండబోతోందో స్పష్టం చేస్తున్నాయి. షైన్ స్ర్కీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.