Chiranjeevi: ఒక్కో విషయంలో ఒక్కొక్కరు స్ఫూర్తిగా నిలిచారు..
ABN, Publish Date - May 01 , 2025 | 06:59 PM
మెగాస్టార్ చిరంజీవి తనలో స్ఫూర్తినింపిన భారతీయ నటులపై ప్రశంసలు కురిపించారు. ఒక్కో విషయంలో ఒక్కొక్కరు స్ఫూర్తిగా నిలిచారని తెలిపారు.
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తనలో స్ఫూర్తినింపిన భారతీయ నటులపై ప్రశంసలు కురిపించారు. ఒక్కో విషయంలో ఒక్కొక్కరు స్ఫూర్తిగా నిలిచారని తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో భారత్‌ను గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ హబ్‌గా మార్చాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యక్రమం ‘వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్’ (వేవ్స్). గురువారం అట్టహాసంగా ప్రారంభమైన ఈ వేడుక నాలుగు రోజులు కొనసాగనుంది. ఈ బోర్డులో చిరంజీవి తదితరులు సభ్యులుగా ఉన్న సంగతి తెలిసిందే. ముంబై వేదికగా జరిగిన ‘వేవ్స్’ (World Audio Visual Entertainment Summit)లో ఆయన మాట్లాడారు.
‘‘బాల్యంలో నేను డ్యాన్స్ చేసి కుటుంబం, స్నేహితులను అలరించేవాడిని. అలా నటనపై మొదలైన ఆసక్తి నన్ను చెన్నై వెళ్లేలా చేసింది. నేను అడుగుపెట్టే సమయానికి ఇండస్ట్రీలో ఎంతోమంది లెజండరీ యాక్టర్స్ ఉన్నారు. ‘ఇప్పటికే పలువురు సూపర్‌స్టార్స్ ఉన్నారు కదా. ఇంకా అదనంగా నేనేం చేయగలను?అని అనుకునేవాడిని. ఎలాగైనా అందరి దృష్టిని ఆకర్షించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నా. 1977లో నటనలో శిక్షణ పొందా. మేకప్ లేకుండా సహజంగా నటించాలని మిథున్ చక్రవర్తి నుంచి నేర్చుకున్నా. స్టంట్స్ విషయంలో అమితాబ్ బచ్చన్, డ్యాన్స్ విషయంలో కమల్ హాసన్ నాకు స్ఫూర్తిగా నిలిచారు. వారి సినిమాలు చూస్తూ, నటన పరిశీలిస్తూ నన్ను నేను మలుచుకున్నా’’ అని పేర్కొన్నారు. రజనీకాంత్, మోహన్‌లాల్, , ఆమిర్‌ఖాన్, అక్షయ్‌కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.