Chiranjeevi: ల్యాండ్ మార్క్.. దాటేసిన 'మీసాల పిల్ల'! ఈ రేంజ్‌లో.. చూస్తున్నారేందిరా రాయనా
ABN , Publish Date - Nov 08 , 2025 | 06:42 PM
చిరంజీవి, నయనతార జంటగా నటిస్తున్న 'మన శంకర వరప్రసాద్ గారు' మూవీ నుండి వచ్చిన మీసాల పిల్ల సాంగ్ 50 మిలియన్ వ్యూస్ ను క్రాస్ చేసింది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది.
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), సౌతిండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanatara) జంటగా నటిస్తున్న సినిమా 'మన శంకర వర ప్రసాద్ గారు' (Mana Sankara Varaprasad Garu). ఈ సినిమా నుండి వచ్చిన మీసాల పిల్లా (Meesala Pilla) సాంగ్ విడుదల అయ్యి కాగానే ఇన్ స్టెంట్ హిట్ అయిపోయింది. తాజాగా ఈ పాట 50 మిలియన్ల వ్యూస్ ను క్రాస్ చేసింది. హిట్ మెషిన్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా పండగ వాతావరణంలో, కుటుంబమంతా కలిసి చూసేలా ఉండే ఎంటర్ టైనర్ గా రూపుదిద్దుకుంటోంది. ఈ వైబ్ ను అద్భుతంగా అందించిన పాట 'మీసాల పిల్ల'. భీమ్స్ సెసిరోలియో స్వరాలు సమకూర్చిన ఈ పాటను ఉదిత్ నారాయణ్, శ్వేతా మోహన్ పాడారు.
మెగాస్టార్ చిరంజీవి తన సిగ్నేచర్ చార్మ్, ఎక్స్ప్రెషన్స్, ఎనర్జిటిక్ డ్యాన్స్ మూవ్స్‌తో అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు. ముఖ్యంగా నయనతారతో ఉన్న సీన్స్‌లో ఆయన టైమింగ్ ఫ్యాన్స్ ని అలరించింది. దాంతో ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ సెన్సేషన్‌గా మారిపోయింది. ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, రీల్స్ ఎక్కడ చూసినా 'మీసాల పిల్ల' ఫీవర్‌నే కనిపిస్తోంది. అభిమానులు డాన్స్ చేస్తూ, రీమిక్స్‌లు చేస్తూ, తమ ప్రేమను అద్భుతంగా వ్యక్తపరుస్తున్నారు. ఈ పాటకు వస్తున్న అద్భుతమైన స్పందనతో సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్ ఆకాశాన్ని తాకుతున్నాయి. సాహూ గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్న 'మన శంకరవర ప్రసాద్ గారు' 2026 సంక్రాంతికి గ్రాండ్‌గా విడుదల కానుంది.
Also Read: Akkineni Nagarjuna: బిగ్ బాస్ స్టేజిపై నాగ్ తో అమల డ్యాన్స్..
Also Read: Jaanvi Swarup: మహేశ్ కూతురికి చెక్ పెట్టిన మేనకోడలు.. మంజుల పెద్ద స్కెచ్చే వేసింది