Chiranjeevi: సజ్జనార్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన చిరు.. ఎందుకంటే.. 

ABN , Publish Date - Oct 11 , 2025 | 09:01 PM

టాలీవుడ్ మెగాస్టార్  చిరంజీవి.. హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

టాలీవుడ్ మెగాస్టార్  చిరంజీవి (Chiranjeevi).. హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ను (VC Sajjanar) మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌ సీపీగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో సజ్జనార్‌ను (VC Sajjanar) కలిసి పుష్పగుచ్ఛంతో శుభాకాంక్షలు తెలిపారు. గతంలో సైబరాబాద్‌ సీపీగా పని చేసిన సమయంలో, కరోనా సమయంలో ప్లాస్మా దానం ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఇద్దరూ కలిసి పలు  అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. చిరంజీవితో పాటు అయన కూతురు సుష్మిత కూడా సజ్జనార్ ను కలిశారు. 

Sajjanar-chiru.jpg

ప్రస్తుతం చిరంజీవి అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ‘మన శంకర వరప్రసాద్’ చిత్రంలో   నటిస్తున్నారు. నయనతార కథానాయిక. సంక్రాంతి కానుకగా ఈ మూవీ తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వశిష్ఠ దర్శకత్వంలో సోషియో ఫాంటసీ ఫిల్మ్‌ ‘విశ్వంభర’లోనూ నటిస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ  సినిమా రానుంది. ఈ రెండు చిత్రాలు కాకుండా   శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో ఓ  యాక్షన్‌ మూవీలో చిరు సందడి చేయనున్నారు. అలాగే బాబీతో ఈ సినిమా ప్రకటించారు. 

Updated Date - Oct 11 , 2025 | 11:16 PM