Vishwambhara: సీజీ అవుట్‌పుట్ సూపర్.. చిరు హ్యాపీ..
ABN , Publish Date - Jul 10 , 2025 | 08:19 PM
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం విశ్వంభర వశిష్ఠ దర్శకుడు. ఈ సినిమాకు సంబంధించి ఓ అప్‌డేట్ వచ్చింది.
మెగాస్టార్ చిరంజీవి (chiranjeevi) నటిస్తున్న చిత్రం ‘విశ్వంభర’ (Vishwambhara). వశిష్ఠ దర్శకుడు. త్రిష (Trisha) కథానాయిక. యువీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఓ అప్‌డేట్ వచ్చింది. ఇటీవల చిరంజీవి సీజీ అవుట్‌పుట్‌లో 45 నిమిషాల భాగాన్ని చూశారట. ఇది ఆయనకు బాగా నచ్చడంతో తన సంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ చిత్రానికి ఒక స్పెషల్ సాంగ్ మరియు కొన్ని రోజుల ప్యాచ్‌వర్క్ మినహా చిత్రీకరణ పూర్తయిందనే వార్త నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ స్పెషల్ సాంగ్‌కు భీమ్స్ సంగీతం అందించనున్నారు. అయితే ఇది రీమిక్స్ సాంగ్ కాదు. పూర్తిగా కొత్త పాట. కేజీఎఫ్‌లోని ‘గాలి గాలి’ పాటతో మెప్పించిన నటి మౌనీ రాయ్ ఈ పాటతో తెలుగు సినిమాలోకి అడుగుపెట్టబోతున్నారు. ‘బింబిసార’ చిత్రంతో ఫాంటసీ జానర్‌లో తనను తాను నిరూపించుకున్న మల్లిడి వశిష్ట ఈ సోషియో ఫాంటసీ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసిన సెప్టెంబర్‌లో ఈ సినిమాను విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.