Mana Shankara Vara Prasad Garu: 25 రోజులే.. బాస్ వ‌చ్చేస్తున్నాడు! స్పెష‌ల్ వీడియో అదిరింది

ABN , Publish Date - Dec 18 , 2025 | 07:01 PM

'మన శంకరవరప్రసాద్ గారు' విడుదలకు సరిగ్గా మరో 25 రోజులే సమయం ఉండటంతో, మేకర్స్ తాజాగా ఒక అదిరిపోయే మేకింగ్ వీడియోను విడుదల చేశారు.

Mana Shankara Vara Prasad Garu

మెగాస్టార్ చిరంజీవి(Mega Star Chiranjeevi) హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'మన శంకరవరప్రసాద్ గారు'(Mana Shankara Vara Prasad Garu). ఈ సినిమాలో చిరంజీవిని మనం 'శంకర్ దాదా ఎంబీబీఎస్'(Shankardada MBBS), 'అన్నయ్య'(Annayya) సినిమాల్లో చూసినట్లుగా ఓ సరదా వ్యక్తిగా వింటేజ్ కామెడీ టైమింగ్ తో చూడబోతున్నాం. అనిల్ రావిపూడి తన మార్క్ హ్యూమర్ ను మెగాస్టార్ మాస్ మేనరిజమ్స్ కు జోడించి ఒక పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ ను సిద్ధం చేశారు. ఈ సినిమా 2026 జనవరి 12 ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

'మన శంకరవరప్రసాద్ గారు' విడుదలకు సరిగ్గా మరో 25 రోజులే సమయం ఉండటంతో, మేకర్స్ తాజాగా ఒక అదిరిపోయే మేకింగ్ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో చిరంజీవి సెట్స్‌లో అందరితో కలిసి నవ్వుతూ, సరదాగా షూటింగ్‌ లో పాల్గొనడం చూస్తుంటే ఈ సినిమా ఒక ఫీల్ గుడ్ ఎంటర్‌ టైనర్ అని అర్థమవుతోంది. ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార(Nayanathara) హీరోయిన్‌గా నటిస్తుండగా, విక్టరీ వెంకటేశ్(Venkatesh) ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారు. చిరు, వెంకీలను ఒకే ఫ్రేమ్‌లో చూడటం సినీ ప్రేక్షకులకు నిజమైన పండగే అని చెప్పాలి.

భీమ్స్ సిసిరోలియో(Bheems Cicerolio) అందించిన మ్యూజిక్ ఇప్పటికే దుమ్మురేపుతోంది. ముఖ్యంగా 'మీసాల పిల్ల'(Misala Pilla Song) సాంగ్ సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో ట్రెండ్ అవుతోంది. గోల్డ్ బాక్స్ ఎంటర్‌ టైన్ మెంట్స్(Gold Box Entertainments), షైన్ స్క్రీన్స్ (Shine Screens) బ్యానర్లపై మెగా వారసురాలు సుస్మిత కొణిదెల(Shushmitha Konidela), సాహు గారపాటి(Shahu Gorapati) సంయుక్తంగా ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక దర్శకుడు అనిల్ రావిపూడి ధీమా చూస్తుంటే, ఈ సంక్రాంతికి థియేటర్లలో మెగా మాస్ జాతర గ్యారెంటీ అనిపిస్తోంది. మరి చిరు తన అసలు పేరుతో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తారో లేదో చూడాలి!.

Updated Date - Dec 18 , 2025 | 07:24 PM