Chiranjeevi: పాత్ర ఏదైనా కోట మాత్రమే చేయగలరు

ABN , Publish Date - Jul 13 , 2025 | 09:20 AM

టాలీవుడ్ విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు మృతికి చిరంజీవి సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు అయన ట్వీట్ చేశారు. మరికొద్ది సేపట్లో చిరు కోట ఇంటికి చేరుకోనున్నారు.

టాలీవుడ్ విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు (Kota Srinivasarao) మృతికి చిరంజీవి ()సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు అయన ట్వీట్ చేశారు. మరికొద్ది సేపట్లో చిరు (Chiranjeevi) కోట ఇంటికి చేరుకోనున్నారు. 'లెజెండరీ యాక్టర్ , బహుముఖ  ప్రజ్ఞా శాలి  కోట శ్రీనివాస రావు గారు ఇక లేరు అనే వార్త ఎంతో కలచివేసింది. 'ప్రాణం ఖరీదు' చిత్రం తో ఆయన నేను ఒకే సారి సినిమా కెరీర్ ప్రారంభించాము. ఆ తరువాత వందల కొద్దీ సినిమాల్లో ఎన్నెన్నో విభిన్నమైన పాత్రల్లో నటించి, ప్రతి  పాత్రని తన  విలక్షణ, ప్రత్యేక శైలి తో అలరించి  తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిర స్థాయిగా నిలిచిపోయారు కోట. కామెడీ  విలన్, అయినా సీరియస్ విలన్  అయినా, సపోర్టింగ్ క్యారక్టర్ అయినా, ఆయన పోషించిన  ప్రతి పాత్ర ఆయన మాత్రమే చేయగలడు అన్నంత  గొప్పగా నటించారు. కొన్నేళ్ల క్రితం ఆయన కుటుంబం లో  జరిగిన వ్యక్తిగత విషాదం ఆయన్ని మానసికంగా ఎంతగానో  కుంగదీసింది. కోట శ్రీనివాస రావు లాంటి  నటుడు లేని  లోటు చిత్ర పరిశ్రమ కి, సినీ ప్రేమికులకి   ఎన్నటికీ తీరనిది.ఆయన ఆత్మ కి శాంతి చేకూరాలని  ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ  సభ్యులకి, శ్రేయోభిలాషులకి, అభిమానులకి, నా  ప్రగాఢ సంతాపం తెలియ చేస్తున్నాను' అన్నారు.

ఆ ఘనత ఆయనకే దక్కుతుంది: నందమూరి బాలకృష్ణ  

కోట శ్రీనివాసరావు గారి మృతి పట్ల నందమూరి బాల కృష్ణ సంతాపం తెలియజేశారు. నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రలు పోషించిన కోట శ్రీనివాసరావు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. తన విలక్షణ నటనతో ఎన్నో పాత్రలకు జీవం పోశారు. ఇతర భాషల్లోనూ నటించి మెప్పించిన ఘనత ఆయనకే దక్కుతుంది. 1999లో విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన ప్రజాసేవతోనూ మంచి నాయకుడిగా పేరు సంపాదించుకున్నారు. ఆయన మరణం తెలుగు సినీ రంగానికి తీరనిలోటు. వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. కోట శ్రీనివాసరావు గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను' అన్నారు. 

Updated Date - Jul 13 , 2025 | 11:41 AM