Chiranjeevi: మెగాస్టార్ సరసన నయన్.. అంతా ఓకే అయితే..
ABN , Publish Date - May 03 , 2025 | 02:23 PM
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొత్త సినిమా సెట్స్ మీదకెళ్లనుంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించనున్న ఈ సినిమాకు సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొత్త సినిమా సెట్స్ మీదకెళ్లనుంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించనున్న ఈ సినిమాకు సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. త్వరలో రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్లనుంది. ప్రస్తుతం ఇతర ఆర్టిస్ట్‌ల సెలెక్షన్‌లో ఉన్నారు టీమ్. ఈ సినిమాలో చిరుకి జోడీగా ఇద్దరు కథానాయికలు కనిపించనున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం నుంచి హింట్ అందింది. అందులో ఓ పాత్ర కోసం నయనతారను సెలెక్ట్ చేసే దిశగా అనిల్ రావిపూడి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ విషయమై నయన్‌తో చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది. ప్లాన్ అంతా ఓకే అయితే ఈ సినిమా చిరు - నయనతార కాంబినేషన్‌లో హ్యాట్రిక్ సినిమా అవుతుంది.
గతంలో వీరిద్దరూ సైరా నరసింహారెడ్డి, ‘గాడ్ ఫాదర్’ సినిమాల్లో కనిపించారు. ఇక ఈ చిత్రంలో మరో హీరోయిన్ పాత్రకు యువ కథానాయికను ఖరారు చేయనున్నట్లు సమాచారం. అనిల్ స్టైల్ వినోదం, యాక్షన్, కుటుంబ అంశాలతో అల్లుకున్న కథతో రూపొందనున్న చిత్రమిది. ఇందులో శివ శంకర వరప్రసాద్‌గా తన ఒరిజినల్ పేరుతో ఉన్న పాత్రలో కనిపించనున్నారు చిరంజీవి. హీరో వెంకటేశ్ కూడా ఇందులో అతిథి పాత్రలో కనిపిస్తారని సమాచారం.