Mouni Roys Mass Song: మెగా మాస్
ABN , Publish Date - Jul 31 , 2025 | 06:27 AM
చిరంజీవి కథానాయకుడిగా వ శిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘విశ్వంభర’. ఇటీవలే చివరి షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేశారు. ఈ షెడ్యూల్‌లోనే ఓ ప్రత్యేక గీతాన్ని...
చిరంజీవి కథానాయకుడిగా వ శిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘విశ్వంభర’. ఇటీవలే చివరి షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేశారు. ఈ షెడ్యూల్‌లోనే ఓ ప్రత్యేక గీతాన్ని తెరకెక్కించారు. భీమ్స్ సిసిరోలియో స్వరపరిచిన మాస్ బీట్‌కు చిరుతో బాలీవుడ్ భామ మౌనీరాయ్ స్టెప్పులేశారు. ఈ గీతానికి గణేశ్ ఆచార్య నృత్యరీతులు సమకూర్చారు. ఈ సందర్భంగా సెట్స్‌లో చిరంజీవితో దిగిన ఫొటోలను మౌనీరాయ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. చిరంజీవి సర్‌తో కలసి డాన్స్ చేయడం గొప్ప అనుభూతిని ఇచ్చిందని ఆమె తెలిపారు. త్రిష కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్ నిర్మిస్తున్నారు. త్వరలో విడుదల తేదీని ప్రకటించనున్నారు.