Sri Chidambaram: చిన్నోడి గుండెల్లో.. చిన్నారి చేరింది! లిరికల్ వీడియో
ABN , Publish Date - Oct 19 , 2025 | 10:29 PM
గత సంవత్సరం క వంటి బ్లాక్ బస్టర్ సినిమాను ఇండస్ట్రీకి అందించిన చింతా వినీష రెడ్డి, చింతా గోపాల కృష్ణా రెడ్డి శ్రీ చిదంబరంతో ప్రేక్షకుల ఎదుటకు రానున్నారు.
గత సంవత్సరం క వంటి బ్లాక్ బస్టర్ సినిమాను ఇండస్ట్రీకి అందించిన నిర్మాతలు శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్ చింతా వినీష రెడ్డి, చింతా గోపాల కృష్ణా రెడ్డి ఈ మారు మరో వినూత్న చిత్రం శ్రీ చిదంబరం (| Sri Chidambaram) తో ప్రేక్షకుల ఎదుటకు రానున్నారు.
ఈ నేపథ్యంలో ఇటీవల విడుదల చేసిన గ్లింప్స్ వీడియో సినిమాపై ఒక్కసారిగా అటెన్షన్ తీసుకు వచ్చాయి. ఇంతవరకు తెలుగు వారికి అలవాటు లేని కేరళ రూరల్ తరహా కాన్సెప్ట్ తో ఈ చిత్రం రూపొందడం విశేషం.
అయితే తాజాగా ఈచిత్రం నుంచి చిన్నోడి గుండెల్లో చిన్నారి చేరింది (Chinnodi Gundello)చక్కని బొమ్మంటరా అంటూ సాగే ఫీల్‌గుడ్ మెలోడీ లిరికల్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు. కోటి మామిడాల (Koti Mamidala), చందు (Chandu) ఈ పాటకు సాహిత్యం అందించగా. కార్తీక్ (Karthik), మనిషా ఎర్రబత్తిని (Manisha Eerabathini) ఆలపించారు. చందు రవి సంగీతం అందించారు.