Meghalu Cheppina Prema Katha: కార్తీక్, చిన్మయిల గాత్రంలో.. గలగల లిరికల్ వీడియో సాంగ్
ABN , Publish Date - Jun 30 , 2025 | 01:21 PM
నరేశ్ అగస్త్య, రబియా ఖతూన్ జంటగా విపిన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మేఘాలు చెప్పిన ప్రేమ కథ
నరేశ్ అగస్త్య (Naresh Agastya), రబియా ఖతూన్ (Rabia Khatoon) జంటగా విపిన్ (Vipin) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మేఘాలు చెప్పిన ప్రేమ కథ’(Meghalu Cheppina Prema Katha). రాధిక, సుమన్ సునేత్ర ఎంటర్‌టైన్‌మెంట్ బేనర్‌పై ఉమాదేవి కోట నిర్మించారు. ఒక ప్రతిభావంతుడైన సంగీతకారుని చుట్టూ చిత్ర కథతో మ్యూజికల్ రొమాంటిక్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం టీజర్, పాటలు ఇప్పటికే విడుదల చేయగా మంచి స్పందనను రాబట్టుకున్నాయి. త్వరలో థియేటర్లలోకి రానుంది.
ఈ నేపథ్యంలో తాజాగా ఈమూవీ నుంచి గత గత అంటూ సాగే ఓ మెలోడీ సాంగ్‌ను రిలీజ్ చేశారు. రెహమాన్ సాహిత్యం అందించిన ఈ పాటను కార్తీక్‌తో కలిసి చిన్మయి శ్రీపాద ఆలపించగా జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించాడు. ఇదిలాఉంటే ఈ సినిమాలో ప్రిన్స్ రామ వర్మ అనే పెద్ద సంగీత విద్వాంసుడు అతిథి పాత్రలో నటించడమే గాక ఓ పాట కూడా పాడడం విశేషం. కాగా ఈచిత్రాన్నిసిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి అంకితం ఇస్తున్నాం మేకర్స్ ప్రకటించారు.