Coolie: కూలీ.. చికిటు పాటోచ్చేస్తోంది

ABN , Publish Date - Jun 23 , 2025 | 07:51 PM

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ కూలీ చిత్రం నుంచి మేక‌ర్స్ మ‌రో అప్డేట్ ఇచ్చారు.

coolie

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ (Rajinikanth) 171 చిత్రంగా డైరెక్ట‌ర్ లోకేశ్ క‌న‌గ‌రాజ్ (Lokesh Kanagaraj) క‌ల‌యిక‌లో బంగారం స్మగ్లింగ్‌ నేపథ్యంలో రూపొందుతున్న రూపొందుతున్న‌ చిత్రం కూలీ (Coolie). భారీ బ‌డ్జెట్‌తో ఎన్నో అంచ‌నాల మ‌ధ్య తెర‌కెక్కుతున్న‌ ఈ చిత్రంలో నాగార్జున (Nagarjuna Akkineni), ఉపేంద్ర (Upendra), షౌబిన్ (Soubin Shahir), స‌త్య‌రాజ్(Sathya Raj), శృతిహాసన్ (Shruti Haasan) వంటి సౌత్ ఇండియా సూప‌ర్‌ స్టార్లు కీల‌క పాత్ర‌లు పోషించ‌గా అనిరుధ్ ర‌విచంద‌ర్ (Anirudh Ravichander) సంగీతం అందించాడు. స‌న్ పిక్చ‌ర్స్ (Sun Pictures) నిర్మించింది. అగ‌ష్టు 14న థియేట‌ర్ల‌లోకి రానుంది.

ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న‌ ఈ చిత్రం నుంచి ఇటీవ‌ల విడుద‌ల చేసిన‌ గ్లిమ్స్ సినిమాపై అంచ‌నాలు అమాంతం పెరిగాయి. ఈ నేప‌థ్యంలో ఈ చిత్రం నుంచి మేక‌ర్స్ మ‌రో అప్డేట్ ఇచ్చారు. రెండు రోజుల్లో చికిటు (Chikitu) అంటూ సాగే పాట‌ను రిలీజ్ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు సంగీత ద‌ర్శ‌కుడు అనిరుద్ కారులో దిగి వాచ్‌లు ఉన్న దండ‌ను చేతిలో ప‌ట్టుకుని డెన్‌లోకి వెళ్లిన వీడియోను రిలీజ్ చేశారు. 25 బుధ‌వారం ఈ సినిమా పాట‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలిపారు. ఇదిలాఉంటే ఈ సినిమా విదేశీ రైట్స్ రూ. 80 కోట్ల వ‌ర‌కు భారీ ధ‌ర ప‌లుకుతూ సంచ‌ల‌నాలు క్రియేట్ చేస్తోంది.

Updated Date - Jun 23 , 2025 | 07:51 PM