Peddi: 40 రోజుల్లో రికార్డ్ వ్యూస్‌తో దూసుకెళ్లింది..
ABN , Publish Date - Dec 16 , 2025 | 07:15 PM
రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు సాన దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘పెద్ది’. చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఎ.ఆర్ రెహమాన్ సంగీతంలో ఇటీవల విడుదల చేసిన ‘చికిరి’ సాంగ్ ఎంతగా పాపురల్ అయిందో తెలిసిందే.
రామ్‌చరణ్(Ram Charan) హీరోగా బుచ్చిబాబు సాన దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘పెద్ది’ (Peddi). చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఎ.ఆర్ రెహమాన్ సంగీతంలో ఇటీవల విడుదల చేసిన ‘చికిరి’ సాంగ్ ఎంతగా పాపురల్ అయిందో తెలిసిందే. చరణ్ వేసిన హుక్ స్టెప్‌కు ఫ్యాన్ ఫిదా అయిపోయారు. రెహమాన్ బీట్, మోహిత్ చౌహాన్ వాయిస్ సంగీత ప్రియుల్ని మెస్మరైస్ చేసింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే పాట. ప్రాంతాలతో, వయసుతో సంబంధం లేకుండా ఆడ, మగా, చిన్నా, పెద్దా అందరూ ఈ పాట రీల్స్ చేసి పోస్టులు పెడుతున్నారు. ఈ పాట సోషల్ మీడియాలో ఓ బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది.
తెలుగులోనే 100 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది. ఐదు భాషల్లో 150 మిలియన్ల వ్యూస్ సాధించి రికార్డ్ సృష్టించింది. విడుదలైన 40 రోజుల్లో 100 మిలియన్ల వ్యూస్ క్రాస్ చేసి టాలీవుడ్ చరిత్రలో ఫాస్టెస్ట్ 100 మిలియన్లు జాబితాలో టాప్ 7లో నిలిచింది. ఈ విషయాన్ని మేకర్స్ ఓ పోస్టర్ విడుదల చేసి తెలిపారు.
జాన్వీకపూర్ కథానాయిక నటిస్తున్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్నారు. మార్చి 27న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నారు.