Peddi: సరికొత్త రికార్డ్ సృష్టించిన చికిరి చికిరి.. అది కదా చరణ్ రేంజ్

ABN , Publish Date - Nov 24 , 2025 | 04:56 PM

ఓ చికిరి.. చికిరి.. చికిరి.. చికిరి.. ఎక్కడ చూసినా.. ఎక్కడ విన్నా ఇదే సాంగ్ వినిపిస్తుంది. కేవలం ఇండియాలోనే కాదు. జపాన్, చైనా, నైజీరియా.. ఇలా అన్ని దేశాల్లో కూడా ఇదే సాంగ్ వినిపిస్తుంది.

Peddi

Peddi: ఓ చికిరి.. చికిరి.. చికిరి.. చికిరి.. ఎక్కడ చూసినా.. ఎక్కడ విన్నా ఇదే సాంగ్ వినిపిస్తుంది. కేవలం ఇండియాలోనే కాదు. జపాన్, చైనా, నైజీరియా.. ఇలా అన్ని దేశాల్లో కూడా ఇదే సాంగ్ వినిపిస్తుంది. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు.. రీల్స్, వీడియోలు.. అమ్మాయిలు జాన్వీలా ఫీల్ అవుతూ చికిరి చికిరి లా ఫోజులు కొట్టేస్తున్నారు. రామ్ చరణ్(Ram Charan) హీరోగా బుచ్చిబాబు సానా (Bichibabu Sana) దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పెద్ది (Peddi). జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా రిలీజ్ కానుంది.

ఇక ఏ ముహూర్తాన చీకి చికిరి సాంగ్ ను రిలీజ్ చేశారో కానీ, అది దేశం దాటి రికార్డులు సృష్టిస్తోంది. గేమ్ ఛేంజర్ సినిమా తరువాత చరణ్ కు ఒక పెద్ద హిట్ అనివార్యమైంది. ఆ హిట్ అందించడానికి బుచ్చి రంగంలోకి దిగాడు. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి పాజిటివిటీ ఎంత ఉందో.. అంతకు మించిన నెగిటివిటీ కూడా వచ్చింది. దీంతో బుచ్చి చాలా జాగ్రత్తగా పెద్దిని ప్లాన్ చేస్తూ వచ్చాడు.

ఫస్ట్ షాట్ అంటూ గ్లింప్స్ ని రిలీజ్ చేసినప్పుడు.. ఇది సిక్సర్ కొడితేనే సినిమాపై ఉన్న నెగిటివిటీ పోతుంది అని చెప్పారు. ఫస్ట్ షాటే పెద్ది సిక్సర్ కొట్టి షేక్ చేశాడు. సరే ఇది కాదు మొదటి సింగిల్ వస్తుంది కదా.. అప్పుడు కచ్చితంగా చరణ్ ట్రోల్ మెటీరియల్ అవుతాడని ట్రోలర్స్ కాచుకొని కూర్చున్నారు. కానీ, చికిరి చికిరి సాంగ్ రిలీజ్ అయ్యి.. దేశాలు దాటి పయనిస్తుంది. అంతేనా 100 మిలియన్ వ్యూస్ సాధించి రికార్డ్ సృష్టించింది. చరణ్ డ్యాన్స్, ఆ స్టైల్, జాన్వీ అందాలు.. అన్నింటికీ మించి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఇక ఈ రికార్డులు చూసాక మెగా ఫ్యాన్స్.. అది చరణ్ రేంజ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ముందు ముందు ఈ సినిమా ఎలాంటి రికార్డులను సృష్టిస్తుందో చూడాలి.

Updated Date - Nov 24 , 2025 | 05:12 PM