Mahesh Babu: మహేశ్‌ పుట్టినరోజు.. చిరు చమత్కారం..

ABN , Publish Date - Aug 09 , 2025 | 10:37 AM

టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు (HBD Mahesh Babu) పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి.

టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు (HBD Mahesh Babu) పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. మెగాస్టార్‌ చిరంజీవి, ఎన్టీఆర్‌, మెహర్‌ రమేశ్‌, శ్రీనువైట్లతోపాలు 14 రీల్స్‌, హారికా, హాసిని క్రియేషన్స్‌, ఎస్‌వీసీసీ ఇలా పలు నిర్మాణ సంస్థలు మహేశ్‌కు సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.

'ప్రియమైన మహేశ్‌కు 50వ పుట్టినరోజు శుభాకాంక్షలు. తెలుగు సినీ పరిశ్రమకు మీరు గర్వకారణం. వయసు పెరిగేకొద్దీ మీరు చిన్నవారు అవుతున్నట్లు కనిపిస్తున్నారు. కెరీర్‌లో మీరేంతో ఉన్నత స్థాయికి చేరుకోవాలని మనసారా కోరుకుంటున్నాను’  అని  చిరంజీవి ట్వీట్‌ చేశారు.



‘హ్యపీ బర్త్‌డే మహేశ్‌ అన్నా.. ప్రేమ, సక్సెస్‌  ఎప్పుడు  మీ వెంటే ఉండాలని కోరుకుంటున్నా’ అని తారక్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు.

'నాడు తెలుగు నాట మొదలైన నీ “దూకుడు” నేడు ప్రపంచవ్యాప్తంగా కొనసాగాలని కోరుకుంటూ'

- శ్రీను వైట్ల 

Updated Date - Aug 09 , 2025 | 12:23 PM