Tollywood Stars: హనీమూన్ ట్రిప్‌కి సమంత.. హాలీడే ట్రిప్‌కి శోభిత

ABN , Publish Date - Dec 30 , 2025 | 09:09 PM

న్యూ ఇయర్(New Year) వేడుకలకు కౌంట్‌డౌన్ మొదలవడంతో సామాన్యులే కాదు, సెలబ్రిటీలు కూడా సెలబ్రేషన్ మూడ్‌లోకి వచ్చేశారు.

samantha

Tollywood Stars: న్యూ ఇయర్(New Year) వేడుకలకు కౌంట్‌డౌన్ మొదలవడంతో సామాన్యులే కాదు, సెలబ్రిటీలు కూడా సెలబ్రేషన్ మూడ్‌లోకి వచ్చేశారు. వరుస షూటింగ్స్, డేట్స్‌తో ఏడాది పొడవునా బిజీగా గడిపిన టాలీవుడ్ స్టార్ హీరోలు ఇప్పుడు రిలాక్స్ మోడ్‌లోకి వెళ్లారు. ఫ్యామిలీతో కలిసి న్యూ ఇయర్‌ను జాలీగా సెలబ్రేట్ చేసుకోవడానికి విదేశీ టూర్స్‌కు క్యూ కట్టారు. టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా స్టార్ సెలబ్రిటీలంతా తమకు నచ్చిన డెస్టినేషన్స్‌లో ల్యాండ్ అవుతున్నారు.

ఇప్పటికే అక్కినేని నాగార్జున, అమల దంపతులు విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మరోవైపు రష్మిక మందన్న, విజయ్ దేవరకొండలు న్యూ ఇయర్‌కు ముందే వరుస ట్రిప్స్‌తో అభిమానులను ఆకట్టుకుంటున్నారు. వారి ట్రావెల్ ఫొటోలు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. ప్రతి ఏడాది వీరి వెకేషన్ లో విజయ్ ఎక్కడ ఉన్నాడా అని అభిమానులు వెతికేవారు. కానీ, ఈసారి రష్మికనే.. విజయ్ ఫోటోలను షేర్ చేసేలా కనిపిస్తోంది.

రీసెంట్ గా సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యామిలీతో కలిసి న్యూఇయర్ సెలబ్రేషన్స్ కోసం విదేశాలకు చెక్కేశాడు. రాజమౌళి సినిమా 'వారణాసి' షూటింగ్స్ నుంచి కాస్త బ్రేక్ దొరకడంతో కుటుంబంతో కలిసి జాలీగా గడిపేందుకు వెళ్లిన వీడియోలు వైరల్ గా మారాయి. మరోవైపు అక్కినేని నాగచైతన్య,శోభిత దంపతులు కూడా న్యూ ఇయర్ వేడుకల కోసం విదేశాలకు బయలుదేరారు. పెళ్లి తర్వాత వరుస షూటింగ్స్‌తో బిజీగా ఉన్న ఈ జంట.. ఇప్పుడు కలసి ప్రశాంతంగా సమయం గడిపేందుకు ఈ ట్రిప్‌ను ప్లాన్ చేసుకున్నారు.

ఇక కొత్తగా పెళ్ళైన జంట సమంత, రాజ్ నిడిమోరు కూడా తమ హనీమూన్ ట్రిప్ కి వెళ్లినట్లు కనిపిస్తున్నారు. ఈ నెలలోనే సామ్ - రాజ్ వివాహాం జరిగింది. ఆ తరువాత వీరిద్దరూ కలిసి పోర్చగల్ వెళ్లినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఫోటోలను సామ్ అభిమానులతో పంచుకుంది. డిసెంబర్ ఎలా గడిచింది అనే క్యాప్షన్ తో ఆమె కొన్ని ఫోటోలను షేర్ చేసింది. పోర్చగల్ లో రాజ్ తో కలిసి పెళ్లి తరువాత హనీమూన్ కి వెళ్లినట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

మొత్తానికి టాలీవుడ్ హీరోలు, హీరోయిన్లు తమకు నచ్చిన డెస్టినేషన్స్‌లో కొత్త ఏడాదికి ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారు. 2025కి గుడ్‌బై చెబుతూ, కొత్త ఆశలు, కొత్త లక్ష్యాలతో 2026లోకి అడుగుపెడుతున్నారు. అభిమానులు కూడా తమ ఫేవరెట్ స్టార్స్ కొత్త ఏడాదిని ఎక్కడ, ఎలా సెలబ్రేట్ చేస్తున్నారో చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Updated Date - Dec 30 , 2025 | 09:30 PM