Bunny Vas: బన్నీవాస్ కొత్త స్టెప్.. రైటా... రాంగా...
ABN , Publish Date - Jun 04 , 2025 | 03:39 PM
బన్నీవాస్ అంటే.. అల్లు అరవింద్.. అల్లు అరవింద్ అంటే బన్నీవాస్.. ఇప్పటి దాకా ఇండస్ట్రీలో వినిపించిన మాట ఇది. అయితే ఇప్పుడు అల్లు కాంపౌండ్ నుంచి ఓ అడుగు పక్కకేస్తున్నాడు బన్నీ వాస్. కొత్త బ్యానర్తో పాటు కొత్త ప్రాజెక్టును ప్రకటించి హాట్ టాపిక్ గా మారాడు.
బన్నీవాస్ (Bunny Vas).. ఈ పేరు తెలియని సినీ లవర్ ఉండడు. అల్లు ఫ్యామిలీ (Allu Family ) కాంపౌండ్లో వరుస సినిమాలు తీస్తూ నిర్మాతగా ఎదిగాడు. గీతా ఆర్ట్స్ (Geetha Arts) వారి GA2లో కో-పార్టనర్ గా ఉంటూ ఆ బ్యానర్ లో వరస సినిమాలు చేసి ఫుల్ జోష్ లో దూసుకెళ్ళాడు. రీసెంట్ గా తండేల్ (Thandel ) మూవీతో బ్లాక్ బస్టర్ కూడా కొట్టాడు. అయితే ఇప్పుడు బన్నీవాస్ కొత్త స్టెప్ వేశాడు. బన్నీ వాస్ వర్క్స్( BV Works) అనే సొంత ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి… మరో రెండు కంపెనీలతో జట్టు కట్టి కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు.
సప్త అశ్వ క్రియేటివ్స్ (Sapta Aswa Creatives ) , వైరా ఎంటర్టైన్మెంట్స్ తో(Vyra Entertainments) కలిసి బన్నీ వాస్ వర్క్స్ ఓ సూపర్ ఇంట్రెస్టింగ్ మూవీని లైన్లో పెట్టింది. రీసెంట్ గా వదిలిన ప్రీ-లుక్ పోస్టర్ (Pre Look Poster) నెట్టింట వైరల్గా మారి రచ్చ చేస్తోంది. సప్త అశ్వ క్రియేటివ్స్ భాను ప్రతాప్ (Bhanu Pratap) తో బన్నీవాస్ ఇప్పటికే తండేల్ (Thandel) , ఆయ్ (Aay), సింగిల్ (Single) సినిమాలతో కలిసి వర్క్ చేసి సూపర్ హిట్స్ అందుకున్నాడు. ఇక వైరా ఎంటర్టైన్మెంట్స్ అంటే హాయ్ నాన్న లాంటి బ్లాక్ బస్టర్స్ తో ఆడియెన్స్ ను అలరించిన బ్యానర్. ఈ కాంబోలో వస్తున్న కొత్త సినిమాపై ఇప్పటికే ఫ్యాన్స్ లో హైప్ పీక్స్ లో ఉంది.
జూన్ 6న ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ కానుంది. ఈ సినిమాతో విజయేంద్ర ఎస్ డైరెక్టర్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ ఫస్ట్ స్టెప్ తో బన్నీ వాస్ ఎలాంటి పేరు తెచ్చుకుంటాడనే విషయం ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరి బన్నీ వాస్ స్టెప్ రైటా!? రాంగా!? లెట్స్ వెయిట్ అండ్ సీ…