Uppena: ఉప్పెన సినిమాను మొదట ఏ హీరోతో చేయాలనుకున్నారో తెలుసా..? 

ABN , Publish Date - Jun 17 , 2025 | 05:03 PM

మెగా హీరో వైష్ణవ్ తేజ్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సినిమా ఉప్పెన. అప్పటివరకు డైరెక్టర్ సుకుమార్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన బుచ్చిబాబు సానా..

Uppena Movie

Uppena:  పండే ప్రతి బియ్యపు గింజ మీద తినేవాడి పేరు ఉంటుంది అని పెద్దలు చెప్తారు. అలానే ప్రతి సినిమాపై కూడా  ఏ హీరో చేయాలో రాసిపెట్టి ఉంటుంది. ఇండస్ట్రీలో కథలు ఎంతోమంది హీరోల వద్దకు వెళ్లి చివరకు ఒక హీరో దగ్గరకు చేరుతాయి. అలా చాలామంది  హీరోలు.. ఎన్నో మంచి హిట్ సినిమాలను మిస్ చేసుకున్నారు. కొన్నిసార్లు డేట్స్ అడ్జెస్ట్ చేయలేక.. మరికొన్ని సార్లు కథ వారికి సెట్ అవ్వదేమో అని హీరోలే కాదన్న సినిమాలు ఉన్నాయి. ఇంకొన్ని డైరెక్టర్స్ మనసులో ఒక హీరోను అనుకున్నా.. అతను నో చెప్తాడేమో అనుకోని వేరొక హీరోతో చేసిన సినిమాలు ఉన్నాయి. అలాంటి సినిమాల్లో ఉప్పెన(Uppena)  కూడా  ఒకటి.


మెగా హీరో వైష్ణవ్ తేజ్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సినిమా ఉప్పెన. అప్పటివరకు డైరెక్టర్ సుకుమార్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన బుచ్చిబాబు సానా.. డైరెక్టర్ గా మారి ఒక కథను రాసుకొని సుకుమార్ కు వినిపించడం. శిష్యుడు ఎదగాలని, అందులో లోపాలు ఉంటే వాటిని కరెక్ట్ చేసి సెట్స్ మీదకు  తీసుకువెళ్లాడు సుకుమార్. వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి జంటగా విజయ్ సేతుపతి విలన్ గా నటించిన ఉప్పెన సినిమా  2021 లో రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. ఉప్పెన క్లైమాక్స్ కు ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ నే ఉందని చెప్పొచ్చు. అసలు ఇలాంటి ఒక క్లైమాక్స్  ను ప్రేక్షకుడు ఊహించి ఉండడు అని చెప్పొచ్చు. 


ఇక జాతీయ అవార్డును సైతం కైవసం చేసుకున్న ఈ సినిమాను మొదట వైష్ణవ్ తేజ్ తో చేయాలని అనుకోలేదట బుచ్చిబాబు.  ఉప్పెన సినిమాను మొదట  విజయ్ దేవరకొండతో అనుకున్నాడట బుచ్చిబాబు. కథ సిద్ధం చేసుకోని హీరో కోసం వెతుకుతుంటే.. విజయ్ దేవరకొండ అయితే బావుంటుంది అనుకున్నా. కానీ అప్పటికే అర్జున్ రెడ్డి సినిమా హిట్ అయ్యి అతని రేంజ్ మారిపోయింది. ఆ సమయంలో ఇలాంటి ప్రేమకథను చెప్పడం సరైనది కాదు అనిపించింది. 


ఇక దీంతో విజయ్ లాంటి మరో కొత్త కుర్రాడిని వెతకాలి. లుక్స్ లో సేమ్ విజయ్ దేవరకొండలానే ఉండాలని వెతుకుంటుండగా.. సోషల్ మీడియాలో వైష్ణవ్ ఫొటోస్ కనిపించాయి.  సినిమాను మొత్తం తన భుజాలపై వేసుకొని నడిపించే హీరో దొరికేసాడని వైష్ణవ్ ను ఫిక్స్ అయిన బుచ్చిబాబు.. మెగా కాంపౌండ్ లోకి అడుగుపెట్టాడు. చిరుకు సైతం ఉప్పెన కథ నచ్చడంతో సెట్స్ మీదకు వెళ్లిపోయింది.


అలా విజయ్ వద్దకు రావాల్సిన సినిమా వైష్ణవ్ చేతికి వచ్చి చేరింది. ఒకవేళ విజయ్ కనుక ఈ సినిమా చేసి ఉంటే.. గట్టిగా ట్రోల్స్ కు గురయ్యేవాడని  చెప్పొచ్చు. ఏదిఏమైనా ఏ హీరోకు రావాల్సిన సినిమా ఆ హీరో వద్దకే చేరుతుంది అనేది నిజమైంది.  అర్జున్ రెడ్డి తరువాత విజయ్.. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం బుచ్చిబాబు పెద్ది సినిమాతో బిజీగా ఉన్నాడు. 

Anupama Parameswaran:  నాకు నటించడం రాదన్నారు

Updated Date - Jun 17 , 2025 | 05:08 PM