Brahmanandam Praises: అందరూ చూడాల్సిన సినిమా

ABN , Publish Date - Aug 21 , 2025 | 05:18 AM

ఆర్‌.నారాయణ మూర్తి లీడ్‌ రోల్‌లో నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘యూనివర్సిటీ పేపర్‌ లీక్‌’. సినిమా ఈ శుక్రవారం విడుదలవుతోంది. తాజాగా ఈ చిత్రాన్ని...

ఆర్‌.నారాయణ మూర్తి లీడ్‌ రోల్‌లో నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘యూనివర్సిటీ పేపర్‌ లీక్‌’. సినిమా ఈ శుక్రవారం విడుదలవుతోంది. తాజాగా ఈ చిత్రాన్ని ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం చూశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘హాయిగా తలార స్నానం చేసి నేత చీర కట్టుకున్న స్ర్తీలా ఉన్న చిత్రమిది. అందరూ చూడాల్సిన సినిమా. ఇందులో నిజాలుంటాయి. బూతులుండవు. జీవితపు విలువలు ఉంటాయి’ అని అన్నారు. ఆర్‌.నారాయణ మూర్తి మాట్లాడుతూ ‘సినిమా చూసి నన్ను ఆశీర్వదించి నాపై ప్రేమను చూపిస్తున్న బ్రహ్మానందం గారికి కృతజ్ఞతలు’ అని అన్నారు.

Updated Date - Aug 21 , 2025 | 05:18 AM