Gurram Papi Reddy: నాకు ప్రత్యేకమైన చిత్రం
ABN , Publish Date - Aug 05 , 2025 | 06:44 AM
నరేశ్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తోన్న సినిమా ‘గుర్రం పాపిరెడ్డి’. తమిళ హాస్యనటుడు యోగిబాబు కీలకపాత్రలో నటించారు. మురళీ మనోహర్ దర్శకత్వంలో...
నరేశ్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తోన్న సినిమా ‘గుర్రం పాపిరెడ్డి’. తమిళ హాస్యనటుడు యోగిబాబు కీలకపాత్రలో నటించారు. మురళీ మనోహర్ దర్శకత్వంలో వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్(బాబి) నిర్మిస్తున్నారు. సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో సినిమా టీజర్‌ను మేకర్స్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా హాస్య నటుడు బ్రహ్మానందం మాట్లాడుతూ ‘ఇది నాకు ప్రత్యేకమైన చిత్రమవుతుంది. ఇందులో జడ్జి పాత్రలో నటించాను. మంచి కామెడీతో సాగే థ్రిల్లర్ మూవీ ఇది. కొత్త వాళ్లు ఇండస్ట్రీకి రావాలి. అప్పుడే మన సినిమా అభివృద్ధి చెందుతుంది’ అని అన్నారు. యోగిబాబు మాట్లాడుతూ ‘ఈ సినిమా ద్వారా నేరుగా తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడం సంతోషంగా ఉంది’ అని అన్నారు. హీరో నరేశ్ అగస్త్య మాట్లాడుతూ ‘సినిమాలో నేనే హీరో అంటున్నారు. కానీ ఇందులో నటించిన ప్రతీ పాత్రకూ ప్రాధాన్యం ఉంటుంది’ అని అన్నారు. మురళీ మనోహర్ మాట్లాడుతూ ‘బ్రహ్మానందం క్యారెక్టర్ ద్వారానే కథ నెరేట్ అవుతుంది. ఆయన ద్వారానే పాత్రలన్నీ పరిచయం అవుతాయి’ అని చెప్పారు. నిర్మాతలు జయకాంత్, అమర్ బురా మాట్లాడుతూ ‘ఈ సినిమా నరేశ్ అగస్త్యకు టర్నింగ్ పాయింట్ అవుతుంది’ అని అన్నారు.