Akhanda 2: సినిమాలో లాజిక్కులు మిస్‌.. అంటే బోయపాటి ఒప్పుకోవడం లేదు

ABN , Publish Date - Dec 16 , 2025 | 11:29 PM

మన తత్వం ఏమిటి? ప్రపంచంలో ఎవరైనా మనల్ని చూసి చేతులెత్తి దండం పెడతారు ఎందుకు? మనం ఆచరించే ధర్మం కోసం. మనం బిడ్డ పుట్టగానే పేగు తెంచి దేవుడికి ముడి వేస్తాం. దేవుడు పేరు పెట్టుకుంటాం. ఎదుగుతుంటే దేవుడు దయ అంటారు.

Boyapati srinu

'ప్రేక్షకులు ఇచ్చిన ఈ అఖండ విజయాన్ని ఎంత ఫీలైనా తక్కువే. ఇంకా కావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా డబ్బు కోసం తీసింది కాదు. అఖండ భారతం గురించి అందరికీ తెలియాలని తీశాం’ అని బోయపాటి శ్రీను (Boyapati Srinu) అన్నారు. ఆయన దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ (NBK) నటించిన చిత్రం 'అఖండ–2: తాండవం’ (Akhanda 2) 14 రీల్స్‌ ఫ్లస్‌ పతాకంపై గోపీచంద్‌ ఆచంట, రామ్‌ ఆచంట నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 5య విడుదల కావాల్సింది. పలు కారణాల వల్ల 12న విడుదలైంది. ఈ సందర్భంగా బోయపాటి శ్రీను విలేకర్లతో మాట్లాడారు.

మన తత్వం ఏమిటి? ప్రపంచంలో ఎవరైనా మనల్ని చూసి చేతులెత్తి దండం పెడతారు ఎందుకు? మనం ఆచరించే ధర్మం కోసం. మనం బిడ్డ పుట్టగానే పేగు తెంచి దేవుడికి ముడి వేస్తాం. దేవుడు పేరు పెట్టుకుంటాం. ఎదుగుతుంటే దేవుడు దయ అంటారు. చివరికి లోకాన్ని విడిచినప్పుడు కూడా దేవుడి దగ్గరికి వెళ్ళాడు అంటాం. మనకి కష్టం వచ్చినా దేవుడే ఆనందం వచ్చిన దేవుడే. అలాంటి అంశాలతో ఒక గొప్ప దారిని ఎంచుకుని తీసిన సినిమా ఇది. ఇది ప్రతి ఒక్కరికి చేరాల్సిన సినిమా.

ఆ గౌరవం మాకు దక్కింది...

కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమా విడుదల ఆగింది. అయితే మా ఆలోచన బాలయ్య అభిమానుల గురించే. రెండు రోజులు ముందు చెప్తే అర్థం చేసుకుంటారు. కానీ ఒక రెండు గంటల ముందు టికెట్లు తీసుకుని థియేటర్స్‌ దగ్గరకు వెళ్లిన తర్వాత ఇలా వాయిదా అని చెప్తే ఎవరికైనా కోపం వస్తుంది. అది సహజం. అయితే వచ్చిన పరిస్థితి గురించి భయపడలేదు. బాలకృష్ణ ఉన్నారనే ధైర్యం. ఆయన మాకు ఇచ్చిన సపోర్టు మర్చిపోలేము. అలాంటి పరిస్థితి వచ్చిన తర్వాత బాలయ్య గారు వచ్చి సినిమా విడుదలకి ఏం కావాలో అన్నీ చేశారు. బొమ్మపడ్డాక ఆనందానికి అవధ్దుల్లేవు. ఒక మంచి సినిమా తీసి ఆశించాల్సింది డబ్బు కాదు గౌరవం. అలాంటి గౌరవం మాకు దక్కింది. దేశభక్తి, భక్తి రెండు కలిసిన చిత్రాలు తక్కువగా వస్తుంటాయి. అఖండ చూశాక జనాలు అంచనాలు బాగా పెంచేశారు. ఆ తర్వాత వచ్చే సినిమా ఇంకా గొప్ప స్థాయిలో ఉండాలనుకున్నాను. అలాగే మన ధర్మాన్ని చెప్పడం కూడా ఒక గొప్ప విషయం.


Bs.jpg

సంకల్పం, ఓపిక ఉండాలి...

ఇది అవెంజర్స్‌కి స్కోప్‌ ఉన్నంత సినిమా. నిజానికి అవెంజర్స్‌, సూపర్‌ మాన్‌, బ్యాట్‌ మాన్‌.. ఇవన్నీ కూడా పుట్టించినవి. కానీ మనకున్న పాత్రలన్నీ కూడా సత్యాలు. కురుక్షేత్రంలో అన్ని ఆయుదాలు వాడినట్లు రేడియేషన్‌ కనిపిస్తుంటుంది. మనకు అంత ఘనమైన చరిత్ర ఉంది. ఇలాంటి సినిమాలు మనం ఎన్నైనా చేయొచ్చు. మనకు ఉండాల్సిందల్లా సంక?్పం, ఓపిక.

ఆ విషయం ముందే చెప్పాం...

ఇలాంటి సినిమాల్లో లాజిక్కులు వెతకడం కరెక్ట్‌ కాదు. దేశానికి పెద్ద విపత్తు రాబోతుంది. దాన్ని నివారించాలంటే అష్టసిద్థి సాధన ఒకటే మార్గమని ముందే మురళీమోహన్‌ గారి క్యారెక్టర్‌తో వివరంగా చెప్పాం. అష్టసిద్థి అంటే మామూలు విషయం కాదు. ఆ సాధన చేసిన వాళ్ళు ఎలాంటి శక్తులు పొందుతారు మీరు కూడా పరిశోధన చేయవచ్చు. ఆ సాఽధన చేసిన వాళ్ళు చిన్న ఆకారాన్ని పొందగలరు అదే సమయంలో విశ్వరూపాన్ని చూపించగలరు. ఆ సాధనలో ఉన్న మహత్తు అది. సూపర్‌ హ్యూమన్‌కి లాజికల్‌గా వివరణ ఇచ్చాం. నిజానికి అన్ని కమర్షియల్‌ సినిమాల్లో ఉన్న యాక్షన్‌ సీన్లు ఇందులో ఉంటాయి. కానీ ఎక్కడో కాస్త అతీతం లేకపోతే ఈ క్యారెక్టర్‌ అలా సూపర్‌ పవర్‌గా అవ్వదు. ఇందులో మనిషితో దిష్టి తీసి ఒక సన్నివేశం ఉంటుంది. మామూలుగా మనుషులు గుమ్మడికాయతో తీస్తారు. అలాంటి శక్తి సాధన చేసి వచ్చిన వాళ్ళు తొలిసారి ఒక పోరాటం చేస్తున్నప్పుడు ఎంత పవర్‌ ఉంటుందో ఆ సన్నివేశంతో చూపించడం జరిగింది.

తమ్ముడు పవన్‌కు దారి ఇచ్చేదాం అన్నారు..

ఈ సినిమా భారతదేశ ఆత్మ లాంటిది. సెప్టెంబర్‌ 25 సినిమా రిలీజ్‌ అన్నాం. మేము అనుకున్నట్టే కాపీ రెడీ అయిపోయింది. అదే సమయానికి ఓజి సినిమా ఉంది. ఇండస్ర్టీలో రెండు పెద్ద సినిమాలు ఒకేసారి రావడం అంత కరెక్ట్‌ కాదు. రెండు సినిమాలు బాగుండొచ్చు. కానీ థియేటర్స్‌ షేర్‌ అయిపోతాయి. మన రెవిన్యూలు మనమే ఇబ్బంది పెట్టుకున్నట్టుగా ఉంటుంది. అప్పుడు బాలయ్య గారు తమ్ముడికి దారి ఇచ్చేద్దాం, మనం తర్వాత వద్దామన్నారు. అలా మేము పక్కకు వచ్చాము. నాకూ పౌరాణిక చిత్రం చేయాలనే ఆలోచన ఉంది. ఈ సినిమా వరకు మాత్రం ఆ భగవంతుడే పక్కనుండడినడిపించాడు. మరో 10 రోజుల్లోనే నా నెక్స్ట్‌ సినిమాకు సంబంధించిన వివరాలు చెప్తాను.

Updated Date - Dec 17 , 2025 | 06:19 AM