Kannappa: క‌న్న‌ప్ప.. ప‌ర‌మ‌శివుడు లుక్ అద‌ర‌హో!

ABN , Publish Date - May 18 , 2025 | 10:59 AM

మంచు విష్ణు హీరోగా అయన క‌ల‌ల చిత్రంగా రూపొందుతోన్న చిత్రం ‘కన్నప్ప’. జూన్ 27 ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

kannappa

మంచు విష్ణు (Manchu Vishnu) హీరోగా అయన క‌ల‌ల చిత్రంగా రూపొందుతోన్న చిత్రం ‘కన్నప్ప’ (Kannappa). జూన్ 27 ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన పోస్ట‌ర్లు, టాజ‌ర్లు, పాట‌లు సినిమాపై మంచి అంచ‌నాల‌ను పెంచాయి. ఇటీవ‌లే ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు కూడా ప్రారంభించిన విష్ణు అమెరికాలో అక్క‌డ ప్రేక్ష‌కుల మ‌ధ్య‌ సినిమా ప్ర‌చారం మొద‌లు పెట్టారు.

ఎండు రోజుల క్రితం ఈ మూవీ నుంచి చివ‌రి మూడో ఎపిసోడ్ యానిమేటెడ్‌ సిరీస్‌ను సైతం విడుద‌ల చేసిన మేక‌ర్స్ ఆదివారం ప‌ర‌మ శివుడు పాత్ర‌ధారి అక్ష‌య్ కుమార్ (Akshay Kumar) పూర్తి లుక్‌ను రిలీజ్ చేశారు. తాజాగా రిలీజ్ చేసిన లుక్‌లో శివుడి గెట‌ప్‌లో అక్ష‌య్ కుమార్ లుక్ ఎక్స్టార్డినరీగా ఉంది. అచ్చం ఆ ప‌ర‌మ‌శివుడే నా అనేలా అచ్చు గుద్దినట్లు ఉంది. అయితే మ‌న‌కు అధికంగా నార్త్ ఇండియాలో క‌నిపించే శివుడి ప్ర‌తిమ‌ల మాదిరిగా ఈ లుక్ ఉండ‌డం గ‌మ‌నార్హం. కాకుంటే ఈ ఫొటోలో శివుడి మెడ‌లో పాము లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇదిలాఉండ‌గా పార్వ‌తిగా కాజ‌ల్ ఆగ‌ర్వాల్ న‌టిస్తోంది.

GrNHWnFXEAAlWNO.jpg


స్టార్‌ఫ్ల‌స్ ఛాన‌ల్‌లో మ‌హాభారత్ సీరియ‌ల్ డైరెక్ట్ చేసిన ముకేశ్‌ కుమార్‌సింగ్ (Mukesh kumar singh) ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా ప్రీతి ముకుంద‌న్ (Preity Mukhundhan) కథానాయిక. మోహన్ బాబు (Mohanbabu), అక్ష‌య్ కుమార్, ప్రభాస్ (Prabhas), మోహన్ లాల్ (Mohanlal), శరత్ కుమార్ (Sarathkumar), కాజల్ అగర్వాల్ వంటి అగ్ర తార‌లు ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. విష్ణు మంచు తనయుడు అవ్రామ్ భక్త మంచు చిన్న‌ప్ప‌టి తిన్నడు పాత్రతో ఈ సినిమాతో వెండితెర ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. కుమార్తెలు అరియానా, వివియానా ఓ నృత్య‌రూప‌క పాట‌లో క‌నిపించ‌నున్నారు.

Updated Date - May 18 , 2025 | 11:28 AM