Bobby Simha: బాబీ సింహా హీరోగా.. తెలుగులో కొత్త సినిమా ప్రారంభం
ABN , Publish Date - Dec 16 , 2025 | 05:50 AM
బాబీ సింహా (Bobby Simha), హెబ్బా పటేల్ (Hebba Patel) జంటగా మెహర్ యరమతి దర్శకత్వంలో తెరకెక్కనున్న కొత్త చిత్రం సోమవారం ప్రారంభమైంది.
బాబీ సింహా (Bobby Simha), హెబ్బా పటేల్ (Hebba Patel) జంటగా మెహర్ యరమతి దర్శకత్వంలో తెరకెక్కనున్న కొత్త చిత్రం సోమవారం ప్రారంభమైంది. యువ ప్రొడక్షన్స్ (Yuva Productions) బ్యానర్‌పై యువ కృష్ణ నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత ఎస్‌కేఎన్ (SKN) క్లాప్ కొట్టారు. మరో నిర్మాత వంశీ నందిపాటి (Vamsi Nandipati) కెమెరా స్విచ్ఛాన్ చేశారు. నటుడు తనికెళ్ల భరణి (Tanikella Bharani) మేకర్స్‌కి స్క్రిప్ట్ అందజేశారు.
ఈ సందర్భంగా నిర్మాత యువకృష్ణ (Yuva KrishnaTholati) మాట్లాడుతూ ‘మెహర్ (Meher)ఈ కథ చెప్పిన వెంటనే నచ్చింది. నటనకి మంచి ఆస్కారమున్న చిత్రమిది’ అని అన్నారు. హీరో బాబీ సింహా మాట్లాడుతూ ‘నా కెరీర్‌లో ఈ సినిమా చాలా కొత్తగా ఉంటుంది. ఈనెల 22 నుంచి వైజాగ్‌లో షూటింగ్ ప్రారంభించబోతున్నాం’ అని చెప్పారు.