Biker: మరో మంచి డేట్‌ కోసం.. రెండు కారణాలు..

ABN , Publish Date - Nov 23 , 2025 | 01:23 PM

శర్వానంద్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘బైకర్‌’ (Biker). అభిలాష్‌ రెడ్డి (Abhilash Reddy) దర్శకత్వంలో యు.వి క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది.

శర్వానంద్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘బైకర్‌’ (Biker). అభిలాష్‌ రెడ్డి (Abhilash Reddy) దర్శకత్వంలో యు.వి క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రం కోసం శర్వానంద్‌ పూర్తిగా ట్రాన్స్‌ఫామ్‌ అయ్యాడు. కఠినమైన డైట్‌తో బాగా సన్నబడి కుర్రాడిలా కనిపిస్తున్నాడు. బైక్‌ ఛేజ్‌ స్పోర్ట్స్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డిసెంబర్‌ 6న రిలీజ్‌ చేస్తున్నట్లు ఇప్పటికే మేకర్స్‌ ప్రకటించారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం విడుదల వెనక్కి వెళ్తుందని తెలిసింది. అందుకు రెండు కారణాలని టాక్‌ నడుస్తోంది.

ఇందులో రేసింగ్‌ సీన్స్‌ ఎక్కువశాతం వీఎఫ్‌క్స్‌లో చేయాల్సి రావడం, ఆ వర్క్‌ ఇంకా పూర్తి కాకపోవడం ఒక కారణమైతే, డిసెంబర్‌ 5న బాలయ్య నటించిన అఖండ 2 చిత్రం విడుదల కానుంది. ఆ సినిమాకు ఉన్న బజ్‌ గురించి తెలిసిందే! ఒకరోజు తేడా రెండు సినిమాలు రానుండడంతో బైకర్‌ రిలీజ్‌ పై సందిగ్థత నెలకొంది. ఒక్క రోజు గ్యాప్‌తో బాక్సాఫీస్‌ దగ్గర పోటీకి శర్వా ధైర్యం చేస్తాడా అన్నది ఇప్పుడు చర్చగా మారింది.  ఫిల్మ్‌ వర్గాల సమాచారం మేరకు బైకర్‌  రిలీజ్‌ వారం రోజులు వెనక్కి వెళ్లే అవకాశం ఉందని తెలిసింది. ఏం జరుగుతోందనేది చూడాలి. ఈ చిత్రంలో రాజశేఖర్‌ కీలక పాత్ర పోషించారు.  

Updated Date - Nov 23 , 2025 | 01:24 PM