Biggboss 9: బిగ్‌బాస్ 9.. చదరంగం కాదు.. రణరంగం
ABN , Publish Date - Jun 29 , 2025 | 05:50 PM
అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న రియాల్టీ షో బిగ్‌బాస్ ఇప్పటికి 8 సీజన్లు పూర్తి చేసుకుంది. ఇప్పుడు మరో సీజన్‌తో అలరించడానికి రెడీ అవుతోంది.
అక్కినేని నాగార్జున (Nagarjuna) హోస్ట్‌గా వ్యవహరిస్తున్న రియాల్టీ షో ‘బిగ్‌బాస్’ (biggboss 9)ఇప్పటికి 8 సీజన్లు పూర్తి చేసుకుంది. ఇప్పుడు మరో సీజన్‌తో అలరించడానికి రెడీ అవుతోంది. ‘ఆటలో అలుపు వచ్చినంత సులువుగా గెలుపు రాదు. ఆ గెలుపు రావాలంటే, యుద్ధం చేస్తే సరిపోదు. ప్రభంజనం సృష్టించాలి. ఈసారి చదరంగం కాదు. రణరంగమే’ అంటూ నాగార్జున సీజన్9ను పరిచయం చేశారు. అంతేకాదు మరో ఆసక్తికర అప్‌డేట్‌ను పంచుకున్నారు. ఈ సారి షోలోకి సామాన్యులను సైతం ఆహ్వానిస్తున్నారు.
‘‘ఇప్పటివరకూ మీరు బిగ్‌బాస్ షోను ఎంతో ప్రేమించారు. ఇంత ప్రేమను ఇచ్చిన మీకు.. రిటర్న్ గిఫ్ట్‌గా ఏమివ్వాలి? మీరు ఎంతగానో ప్రేమించిన బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీయే రిటర్న్ గిఫ్ట్. ఈ సారి హౌస్‌లోకి సెలబ్రిటీలే కాదు. సామాన్యులకు అవకాశం ఉంది. వచ్చేయండి’’ అని నాగార్జున పేర్కొన్నారు. దీని కోసం ఏం చేయాలంటే వెబ్‌సైట్‌లో రిజిస్టర్ అయి, బిగ్‌బాస్9లో పాల్గొనడానికి కారణం చెబుతూ వీడియోను అప్‌లోడ్ చేేస్త, షరతుల మేరకు హౌస్‌మేట్ అయ్యే ఛాన్స్ లభించవచ్చని జియో హాట్‌స్టార్ తెలిపింది.
అయితే ఈ సీజన్‌కు వ్యాఖ్యతగా నాగార్జున మారతారని, బాలకృష్ణ షోని హోస్ట్ చేసే అవకాశం ఉందని చర్చలు నడిచాయి. అయితే ఇప్పుడు వదిలిన ప్రోమోతో నాగార్జునే ఈ సారి కూడా వ్యాఖ్యతగా వ్యవహరించనున్నారని తెలిసిపోయింది. ప్రస్తుతం ‘బిగ్‌బాస్9’కు సంబంధించి హౌస్‌మేట్స్ ఎంపిక ప్రక్రియ జరుగుతోంది.