Anantha Kaalam: ఇదేక్కడి టీజర్‌రా.. ఇంత షాకింగ్‌గా ఉంది! బిగ్‌బాస్ ఫృథ్వీ అదరగొట్టావ్
ABN , Publish Date - Jun 29 , 2025 | 10:11 AM
తెలుగు బిగ్‌బాస్8 ఫేమ్ ఫృథ్వీ షెట్టి హీరోగా తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కిన చిత్రం అనంతకాలం
తెలుగు బిగ్‌బాస్8 ఫేమ్ ఫృథ్వీ షెట్టి (Prithviraj Shetty) హీరోగా తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కిన చిత్రం అనంతకాలం (Anantha Kaalam). వాలియంట్ విజన్ క్రియేషన్స్ (Valiant Vision Creations) నిర్మించిన ఈ సినిమాకు విజయ్ మంజునాథ్ (Vijay Manjunath) దర్శకత్వం వహించాడు. తాజాగా శనివారం ఈ మూవీ టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్‌ను చూస్తే ప్రతి ఒక్కరికీ గూస్‌బంప్స్ వచ్చేలా ఉంది.
హీరో ఓ సిటీలో మిడ్‌నైట్ ఓ ప్రాంతంలో సిగరేట్ తాగుతూ ఉండగా ఓ వింత ఆకారంలో ఉన్న మనిషఙ బెలూన్ తీసుకోండి సార్ అంటూ గంభీరంగా చెప్పడం.. ఆపై ఈ ప్రపంచం బయట ఉన్న జనాలను తనలో బందీ చేసుకుంటే నువ్వు మాత్రం ఓ చోట ఇరుక్కుంటావ్.. దానిని నుంచి బయటకు వచ్చినా నువ్వు మళ్లీ మళ్లీ అదే చోటకు వెళ్లి ఇరుక్కుంటావ్.. నువ్వు చచ్చే రోజులు దగ్గర పడ్డాయ్ అంటూ చెప్పి వెళుతుంటాడు.
అప్పుడేగా సడన్‌గా ఓ వాహానం వచ్చి గుద్దడంతో హీరోను రోడ్డుపై పడిపోయి చావుతో కొట్టు మిట్టాడుతుంటాడు. అప్పుడు బెలూన్ వ్యక్తి వచ్చి ఆ బాడీ పక్కనే పడుకుని ఇక కథ మొదలు పెడదామా అంటుండగానే.. హీరో చేతికి ఉన్న కంకణం ప్రకాశంతంగా మారి హీరో లేచి నిలబడి.. నువ్వు కాదురా నేను మొదలు పెడతా కథ అని షాక్ ఇస్తాడు. అదే సమయంలో ఓ భారీ వాహానం అ బెలూన్ వ్యక్తిని రోడ్డుపై ఢీ కొట్టి వెళ్లి పోతుంది.ఇలా టీజర్ అద్యంతం ఆసక్తి కరంగా కట్ చేశారు. కాగా ఈ అనంతకాలం (Anantha Kaalam) సినిమాకు సంబంధించిన పూర్తి విషయాలు త్వరలోనే మేకర్స్ వెల్లడించనున్నట్లు సమాచారం.