Bigg Boss Telugu 9: బిగ్ బాస్ దీపావళి ఎపిసోడ్.. భరణి ఎలిమినేషన్! ఇంత షాకిచ్చారేంటి
ABN , Publish Date - Oct 20 , 2025 | 09:27 AM
కింగ్ నాగార్జున హోస్ట్‌గా బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 (Bigg Boss Telugu 9) ఈ ఆదివారం ప్రసారమైన ఎపిసోడ్ పండుగ హంగులతో సాగింది.
కింగ్ నాగార్జున హోస్ట్‌గా బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 (Bigg Boss Telugu 9) ఈ ఆదివారం ప్రసారమైన ఎపిసోడ్ పండుగ హంగులతో సాగింది. దీపావళి సందర్భంగా హౌస్ మొత్తం వెలుగులతో మెరిసిపోయింది. నాగార్జున (Nagarjuna) ఎంట్రీతోనే వేదికపై ఎనర్జీ పెరిగిపోయింది. హౌస్‌మేట్స్ అందరూ ట్రెడిషనల్ లుక్‌లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
ఈ స్పెషల్ ఎపిసోడ్‌లో హీరో సుదీర్ బాబు, బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా, అలాగే శిల్ప శిరోద్కర్ తమ రాబోయే చిత్రం జటాధర ప్రమోషన్ కోసం స్టేజ్‌పై అడుగుపెట్టారు. నాగార్జునతో సరదాగా మాట్లాడుతూ, సోనాక్షి తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించి అందరినీ అలరించింది. నాగ్‌తో కలిసి సుదీర్ బాబు కూడా చిన్న గేమ్ ఆడి ఫన్ మూడ్‌లో మునిగిపోయాడు.
నాగార్జున గతంలో తనతో కథానాయికగా చేసిన శిల్పా శిరోద్కర్‌తో నాటి చిత్ర వివరాలను పంచుకున్నారు. ఆపై.. దీపావళి సంతోషాన్ని డబుల్ చేయడానికి కామెడీ కింగ్ హైపర్ ఆది పెదరాయుడు గెటప్‌లో హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి తన శైలి పంచులు, డైలాగులతో కొత్త జోష్ తీసుకువచ్చాడు. సుమన్ శెట్టి, ఇమ్మాన్యుయేల్‌లను టార్గెట్ చేస్తూ ఫన్నీ సీక్వెన్స్‌లు క్రియేట్ చేశాడు.
ఇక.. ఈ వారం నామినేషన్స్‌లో దివ్య, రాము, భరణి, పవన్, తనూజ ఉన్నారు. దీపావళి సందర్భంగా ప్రత్యేకంగా స్వీట్ బాక్స్ టాస్క్ ప్లాన్ చేశారు. ఒక్కొక్కరుగా సేవ్ అవుతూ చివరికి రాము, భరణి మాత్రమే మిగిలారు. నాగార్జున వారిని యాక్టివిటీ ఏరియాలోకి పిలిచి ఇమ్మాన్యుయేల్ పవర్ అస్త్రం వాడే అవకాశం ఇచ్చారు. ఇమ్మాన్యుయేల్, రాము గేమ్‌లో ఎక్కువగా యాక్టివ్‌గా ఉన్నాడని భావించి అతడిని సేవ్ చేసుకున్నాడు. చివరగా నాగార్జున ప్రకటించినప్పుడు ప్రేక్షకుల ఓటింగ్ ప్రకారం భరణి ఎలిమినేట్ అయ్యాడు. నాగ్ వెల్లడించినట్టుగా ఇమ్మాన్యుయేల్ పవర్ అస్త్రం వాడకపోయినా రాము సేఫ్ అయ్యేవాడు అని చెప్పారు.
భరణి ఎలిమినేషన్‌తో హౌస్‌లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. తనూజ, దివ్య కన్నీళ్లు పెట్టుకున్నారు. భరణి నాకు నాన్నలాంటివాడు, అని తనూజ చెప్పగా, దివ్య "అన్నయ్యలా ఫీల్ అయ్యాను," అని రోదించింది. భరణిని హత్తుకుని వీడ్కోలు పలికారు. మొత్తం మీద ఈ దీపావళి స్పెషల్ ఎపిసోడ్ పండుగ హంగులతో పాటు నవ్వులు, గేమ్స్, ఎమోషన్ల మిశ్రమంగా సాగింది. టాప్ 5లో ఉంటారని భావించిన భరణి ఎలిమినేషన్ అవడం ప్రేక్షకులను షాక్‌కు గురి చేసింది.