Release Date Confusion : ఫ్యాన్స్ లో రిలీజుల కన్ఫ్యూజన్
ABN , Publish Date - Jun 09 , 2025 | 07:31 PM
కన్ఫ్యూజన్.. కన్ఫ్యూజన్.. కన్ఫ్యూజన్.. అవునూ.. టాలీవుడ్ మేకర్స్ అందరూ కన్ఫ్యూజన్‌లో పడ్డారు. పక్కా ప్లాన్‌తో వస్తున్నామని ఆడియెన్స్‌ను ఊరించి.. చివరికి విడుదల విషయమంలో ఎవరికివారు వెనకా ముందు ఆడుతున్నారు. ఏ ప్రాజెక్ట్ చూసినా ఇదే పరిస్థితి.
టాలీవుడ్‌లో ఇప్పుడు రిలీజుల కన్ఫ్యూజన్ (Releases Confusion) నడుస్తోంది. ఆడియెన్స్, ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు తమ అభిమాన హీరోల మూవీలు విడుదలవుతాయా అని ఎంతగానో వెయిట్ చేస్తోంటే..డేట్స్ ఫిక్స్ చేయడానికి మేకర్స్ తలపట్టుకోవాల్సి వస్తోంది. జూన్, జులై నెలల్లో రావాల్సిన క్రేజీ ప్రాజెక్టులు అన్నీ కూడా సినీ లవర్స్‌ను డైలామాలో పడేస్తున్నాయి. సిట్యూవేషన్స్ చూస్తుంటే.. అసలు అనుకున్న టైమ్‌కు వస్తాయా రావా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న బిగ్ బడ్జెట్ హిస్టారికల్ డ్రామా 'హరిహర వీరమల్లు' (Hari Hara Veera Mallu) జూన్ 12న రిలీజ్ అవుతుందని అనుకున్నారు. కానీ సీజీ వర్క్ ఇంకా పెండింగ్‌లో ఉండడంతో మళ్లీ పోస్ట్‌పోన్ అయ్యింది. ట్రైలర్ విడుదల చేసి, కొత్త డేట్ అనౌన్స్ చేస్తాం అంటూ మేకర్స్ పోస్ట్‌పోన్ చేశారు. కానీ ఇప్పటికీ డేట్ ఫైనల్ కాలేదు. జూలై 4న వీరమల్లు రిలీజ్ అవుతుందని ఒక రూమర్ వైరల్ అవుతోంది. కానీ అదీ డౌట్‌ఫుల్‌గానే ఉంది. జూన్ 20న 'కుబేర'(Kubera ), జూన్ 27న 'కన్నప్ప' (Kannappa) లాంటి భారీ పాన్-ఇండియా సినిమాలు రిలీజ్ కోసం రెడీగా ఉన్నాయి. ఇక జూలై 4న విజయ్ దేవరకొండ (Vijay Deverakonda ) నటిస్తున్న 'కింగ్‌డమ్' (Kingdom) సినిమా రాబోతోంది. గౌతమ్ తిన్ననూరి (Gowtham Tinnanuri) డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టు తెలుస్తోంది. నిర్మాత నాగవంశీ (Nagavamshi)కూడా తాము రిలీజ్ డేట్ మార్చే ఆలోచనలో లేమని క్లారిటీ ఇచ్చేశారు. కానీ, వీరమల్లు డేట్ ఫిక్స్ అయితే మాత్రం కొంచెం ఆలోచిస్తామని అన్నారు. కానీ వీరమల్లు జూలై 4న రిలీజ్ అయ్యే అవకాశం కనిపించడం లేదు.
మరోవైపు 'కింగ్‌డమ్' (Kingdom)విషయానికి వస్తే.. ఈ పాన్ఇండియా సినిమాకి ఇంకా ప్రమోషన్స్ సరిగ్గా స్టార్ట్ కాలేదు. ఒక టీజర్, ఒక సాంగ్ తప్ప ఎలాంటి కంటెంట్ రిలీజ్ కాలేదు. జూలై 4కి నెల రోజుల కన్నా తక్కువ సమయమే ఉంది కాబట్టి ప్రమోషన్స్ స్పీడ్ పెంచాల్సిందే. అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వర్క్ ఇంకా పూర్తి కాకపోవడం మరో ట్విస్ట్. త్వరలో అది కంప్లీట్ అవుతుందని టాక్. కానీ టైమ్ చాలా తక్కువగా ఉంది. ఒకవేళ 'కింగ్‌డమ్' కూడా వాయిదా పడితే.. నితిన్ నటిస్తున్న 'తమ్ముడు' (Thammudu) సినిమా జూలై 4న రిలీజ్‌కి రెడీ అవుతోందని బజ్ వినిపిస్తోంది. ఈ సినిమా షూటింగ్, పోస్ట్-ప్రొడక్షన్ వర్క్ దాదాపు పూర్తయినట్టు సమాచారం. మొత్తంగా చూస్తే, జూలై 4న పవన్ కళ్యాణ్, విజయ్ దేవరకొండ, నితిన్‌లో ఎవరి సినిమా థియేటర్లలో సందడి చేస్తుందో ఇంకా క్లారిటీ లేదు. మరి ఈ రేసులో ఎవరు ఫస్ట్ వస్తారో చూడాలి.