Thammudu: భూ.. అంటూ భూతం సాంగ్ రిలీజ్
ABN , Publish Date - Jun 17 , 2025 | 06:54 PM
నితిన్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన తమ్ముడు చిత్రం నుంచి మంగళవారం భూ అంటూ భూతం అనే పాటను రిలీజ్ చేశారు.
నితిన్ (Nithiin) హీరోగా వకీల్ సాబ్ ఫేమ్ వేణు శ్రీరామ్ (Venu Sriram) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం తమ్ముడు (Thammudu). దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో సప్తమి గౌడ (Sapthami Gowda), లయ (Laya), వర్ష బొల్లమ్మ (Varsha Bollamma), సౌరభ్ సచ్‌దేవా, స్వసిక కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, తాజాగా విడుదల చేసిన ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాక సినిమాపై రెట్టింపు అంచనాలను క్రియేట్ చేశాయి. జూలై 4 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ క్రమంలో మేకర్స్ ఈ సినిమా నుంచి భూ అంటే భూతం (Bhuu Antuu Bhuutham) అనే లిరికల్ సాంగ్‌ను మంగళవారం రిలీజ్ చేశారు. సింహాచలం మన్నేలా (Simhachalam Mannela) సాహిత్యం అందించగా అజనీష్ లోక్‌నాథ్ (Ajaneesh Loknath ) సంగీతంలో అనురాగ్ కులకర్ణి (Anurag Kulkarni), అక్షిత పోల (Akshita Pola) ఆలపించారు.