Bharadwaja Thammareddy: ఇండస్ట్రీ కష్టాలతో పనిలేదు.. ఎవరి దారి వారిదే
ABN , Publish Date - Jul 05 , 2025 | 06:19 PM
గతంలో రెండు స్టార్లు స్రైక్ చేసి షూటింగ్‌లు బంద్ చేశారు. దాని వల్ల ఇండస్ట్రీకి జరిగిన లాభం ఏంటి. ఎవరు లాభ లాభపడ్డారు. షూటింగ్ బందు చేయడం వల్ల ఎంతమందికి నష్టం కలిగిందో తెలుసా.
గద్దర్ అవార్డ్స్‌పై (Gaddar awards) వివాదాలు అవసరం లేదని, అవార్డు తీసుకోవాలి అనుకున్నావాళ్లు వస్తారు. కుదరని వాళ్లు రారు. దీనిని రాద్దాంతం చేయడం అనవసరం అని దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ (Bharadwaja Thammareddy) అన్నారు. తాజాగా ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘గద్దర్ అవార్డులకు అమితాబ్ గారు రావాల్సి ఉంది. కానీ రాలేకపోయారు. ఆ ఈవెంట్ విజయవంతంగా పూర్తయింది. కన్నప్ప సినిమా గురించి మాట్లాడుతూ అందులో భక్తిని బడ్జెట్ డామినేట్ చేసిందని అన్నారు. ఇక పాన్ ఇండియా, పాన్ వరల్డ్ సినిమాలకు అర్థం తెలీకుండా సినిమాలు తీస్తున్నారని ఆయన విమర్శించారు. పాన్ ఇండియా పేరుతో తీసిన సినిమాల్లో బాగా ఆడినవి నాలుగో, ఐదో అడని సినిమాలు ఎన్నో ఉన్నాయన్నారు.
ఇండస్ట్రీ కోసం కాదు...
ఇండస్ట్రీ నుంచి కొందరు ప్రముఖులు ఇరు రాష్ట్రాల నాయకులను కలవడాన్ని ఆయన ఎత్తి చూపారు. ‘‘ఇప్పుడు ప్రభుత్వాల వద్ద ఎవరికి వారు ఇండివిడ్యువల్ వెళ్లి పనులు చక్కబెట్టుకుంటున్నారు తప్ప. ఇండస్ట్రీ సమస్యల గురించి చర్చించడానికి ఎవరూ వెళ్లడం లేదు. గతంలో జగన్‌ను కలిసింది కూడా తమ సినిమాల కోసమే తప్ప, ఇండస్ర్టీ మేలు కోసం కాదు’’ అని భరద్వాజ అన్నారు.
బంద్.. ఎవరి లాభం కోసం..
గతంలో రెండు స్టార్లు స్రైక్ చేసి షూటింగ్‌లు బంద్ చేశారు. దాని వల్ల ఇండస్ట్రీకి జరిగిన లాభం ఏంటి? ఎవరు లాభ లాభపడ్డారు? షూటింగ్ బందు చేయడం వల్ల ఎంతమందికి నష్టం కలిగిందో తెలుసా? ఎవరైనా ఆ దిశగా ఆలోచించారా? స్ట్రయిక్ అని చెప్పిన వారు తమ సినిమాలకు లాభం కలిగేలా దానిని ఉపయోగించుకున్నారు. ఆ సాకుతో నాడు తమ సినిమాల్లోని హీరోల రెమ్యూనిరేషన్‌లను తగ్గించారు. కానీ ఆ తరువాత అదే హీరోలకు డబుల్ ట్రిపుల్ ఎమౌంట్‌లు ఇచ్చి సినిమాలు చేశారు. ఇక ఇండస్ర్టీ బంద్‌కు అర్దం ఏముంది. స్ట్రయిక్ టైమ్‌లో చిత్రీకరణలు ఆగిపోయిన ఎన్నో చిన్న చిత్రాలు ఇప్పటికీ పూర్తి కాలేదు. అగ్ర నిర్మాతలంతా నిర్మాతల మండలితో సంబంధం లేకుండా గిల్డ్ అని పెట్టుకున్నారు. అందులోనూ ఒకొరికి మరొకరికి పడదు. చిత్ర పరిశ్రమను శాసిస్తుంది ఆ పదిమంది .. వారి వద్దే డబ్బులున్నాయి. వారి మధ్య కాంపిటీషన్ ఉంటుంది.
దిల్ రాజు సినిమాలు ఎందుకు ఫ్లాప్ అవుతున్నాయి?
దిల్ రాజు డ్రీమ్స్ పేరుతో కొత్తవారిని ప్రోత్సహిస్తూ, సినిమాలు చేసేందుకు సాయం చేస్తామంటున్నారు. కానీ అదే దిల్ రాజు తీసిన సినిమాలు ఎందుకు ఫ్లాప్ అవుతున్నాయో చూసుకోవాలి. ఇండస్ట్రీకి డబ్బులతో రావాలంటున్నారు. ప్యాషన్ గురించి ఎవరూ మాట్లాడటం లేదు.