Bhairavam Team: ,భైరవం బిర్యానీ.. చిట్టి గారెలు.. చికెన్ కర్రీ..
ABN , Publish Date - May 13 , 2025 | 05:23 PM
మంచు మనోజ్(Manoj), నారా రోహిత్ (Nara Rojith), బెల్లం కొండ శ్రీనివాస్ (Bellam konda Srinivas) నటించిన చిత్రం 'భైరవం'(Bhairavam). విజయ్ కనకమేడల తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు బాగానే ఉన్నాయి.
మంచు మనోజ్(Manoj), నారా రోహిత్ (Nara Rojith), బెల్లం కొండ శ్రీనివాస్ (Bellam konda Srinivas) నటించిన చిత్రం 'భైరవం'(Bhairavam). విజయ్ కనకమేడల తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఈ నెల 30న మల్టీస్టారర్‌గా విడుదల కానుంది. అందులో భాగంగా టీమ్ కూడా బాగానే ప్రమోట్ చేస్తోంది. తాజాగా సినిమా టీమ్ సెట్‌లో సందడి చేశారు. చిత్రీకరణ తుదిదశలో ఉంది. ప్రస్తుతం ఫారెస్ట్‌లో చిత్రీకరణ జరుగుతోంది. అయితే టీమ్ అందరూ కలిసి ఆ సెట్‌ను పాకశాలను చేసేశారు. మంచు మనోజ్, నారా రోహిత్ గరిటె పట్టి రుచి కరమైన వంటలు చేశారు. రోహిత్ బిర్యానీ చేయగా, మంచు మనోజ్ చికెన్ కర్రీ, గారెలు చేశారు. టీమ్ మొత్తానికి రుచికరమైన విందును వడ్డించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్న శంకర్ కూతురు కూడా ఆ ఫుడ్‌ను ఎంతో ఎంజాయ్ చేశానని, మూడుసార్లు బిర్యానీ తిన్నానని చెప్పుకొచ్చారు. అదితి శంకర్‌తోపాటు, దివ్యా పిళ్లై, ఆనంది హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మాత కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్నారు.