Bhagyashri Borse: నేను హీరోయిన్ అంటే.. మొదట రానా గారు ఒప్పుకోలేదు
ABN , Publish Date - Nov 07 , 2025 | 08:06 AM
దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) కథానాయకుడిగా నటిస్తున్న పీరియాడికల్ డ్రామా కాంత (Kaantha), సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్తో కలసి రానా దగ్గుబాటి తన స్పిరిట్ మీడియా పతాకంపై నిర్మిస్తున్నారు.
దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) కథానాయకుడిగా నటిస్తున్న పీరియాడికల్ డ్రామా కాంత (Kaantha), సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్తో కలసి రానా దగ్గుబాటి తన స్పిరిట్ మీడియా పతాకంపై నిర్మిస్తున్నారు. నవంబర్ 14న విడుదల కానుంది. గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ప్రభాస్ చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేశారు. 1950-60ల నాటి మద్రాస్ సినీ పరిశ్రమ నేపథ్యంలో కథ సాగుతుంది. దుల్కర్ టీకే మహదేవన్ అనే సూపర్ స్టార్ పాత్రను పోషిస్తున్నారు. అతనికీ, దర్శక నిర్మాత అయిన అయ్య (సముద్రఖని)కు మధ్య ఉన్న సంఘర్షణ నేపథ్యంలో కథ సాగుతుంది అని ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది.
ఈ సందర్భంగా దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ.. 'ఈ సినిమాను అందరూ థియేటర్లలో చూడండి. ఇదొక గ్రేట్ ఎక్స్ పీరియన్స్. నా స్నేహితుడు రానాతో కలసి నిర్మించడం ఆనందాన్నిచ్చింది' అని చెప్పారు. రానా దగ్గుబాటి (Rana Daggubati) మాట్లాడుతూ 'కథ విన్న వెంటనే తప్పకుండా ఈ సినిమా చేయాలనిపించింది. ఇలాంటి పీరియాడిక్ చిత్రానికి దుల్కర్ లాంటి రెట్రోకింగ్ పర్ఫెక్ట్, నవంబర్ 14 తర్వాత మీరందరూ దుల్కర్‌ను నట చక్రవర్తి అని పిలుస్తారు' అని చెప్పారు.కాంత లాంటి గొప్ప చిత్రంలో నటించినందుకు గర్వంగా ఉందని సముద్రఖని తెలిపారు. దుల్కర్ సల్మాన్ నటన ప్రతి ఒక్కరినీ మెప్పిస్తుందని సెల్వమణి సెల్వరాజ్ చెప్పారు.
భాగ్యశ్రీ (Bhagyashri Borse) మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. నాకు ఇది చాలా స్పెషల్ చిత్రం అని భాగ్యశ్రీ బోర్సే తెలిపారు. ఇప్పటివరకు నా సినిమాలు చూశారు. ఈ సినిమాలో నేను యాక్ట్ చేయడం చూస్తారు. కాంత నాకు చాలా చాలా స్పెషల్. ఈ సినిమాకు నేను హీరోయిన్ అంటే మొదట రానా గారు ఒప్పుకోలేదు.. తర్వాత ఆడిసన్స్ తర్వాత గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అంటూ చెప్పుకొచ్చింది. మీ అందరి ప్రేమకు థాంక్ యూ. ఈ సినిమాని థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నా అన్నారు.